Brahmanandam Second Son: టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం.. పరిచయం అక్కరలేని పేరు. హాస్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన బ్రహ్మానందం గురించి మనకు ఎంత ఎక్కువ తెలుసో.. ఆయన కుటుంబం గురించి అంత తక్కువ తెలుసు. చాలా మందికి ఆయన కుటుంబ నేపథ్యం తెలియదు. బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు గౌతమ్ అప్పట్లో ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో కుమారుడు ఎవరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆయనకు రెండో కుమారుడు ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇటీవల రెండో కుమారుడి నిశ్చితార్థం అట్టహాసంగా నిర్వహించారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవవడంతో అందరికీ తెలిసింది.
ఘనంగా నిశ్చితార్థం..
బహ్మ్రానందం ఇంట ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఐశ్వర్య అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఇటీవల ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో సిద్ధార్థ్–ఐశ్వర్య ఉంగరాలు మార్చుకున్నారు.
ప్రముఖుల హాజరు..
ఈ వేడుకకు అలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కొడుకు కోడలి గురించి ఆరా..
ఇక నెటిజన్లు ప్రస్తుతం బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ్, కాబోయే కోడలి గురించి సెర్చ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ విదేశాల్లో
ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఆయన వెండితెరపై ఎప్పుడూ కనిపించలేదు. ఇక సిద్ధార్థ్ చేసుకోబోయే అమ్మాయి ఐశ్వర్య. ఈమె డాక్టర్ గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్ చేసింది.
కరీంనగర్ ఆడబిడ్బ..
ఇక బ్రహ్మానందంకు కాబోయే రెండో కోడలు ఐశ్వర్య కరీంనగర్ ఆడబిడ్డ. ఆమె కరీంనగర్‌లోని ప్రముఖ గైనకాలజిస్ట్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యజమాని డాక్టర్ పద్మజ–వినయ్ దపంతుల ఒక్కగానొక్క కుమార్తె. ఐశ్వర్య కూడా వైద్యురాలు. తల్లికి తగినట్లుగా గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. పద్మజ కూడా గైనకాలజీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మొత్తానికి యాక్టర్ బ్రహ్మానందం ఇంట్లో డాక్టర్ కోడలిగా అడుగుపెట్టబోతోంది.