Trivikram: మొదట ఇండస్ట్రీకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లు అందుకొని రైటర్ యొక్క సత్తా ఏంటో చూపించిన ఒకే ఒక్క రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిగా ఒక రైటర్ కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకోవచ్చు అని ఆయన తీసుకొని ప్రూవ్ చేసిన ఒకే ఒక రైటర్ త్రివిక్రమ్. అలాగే ఇండస్ట్రీలో రైటర్ యొక్క వాల్యూ పెంచిన రచయిత కూడా తనే కావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాడు.
ఇక అదే సమయంలో పోసాని కృష్ణ మురళి ఒక సినిమాకి రైటర్ గా పనిచేస్తున్న సమయంలో ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించిన నటుడు అయిన విక్రమ్ కి త్రివిక్రమ్ డైలాగ్ ఎక్స్ ప్లెయిన్ చేశాడు. అతనికి సరిగ్గా అర్థం కాక త్రివిక్రమ్ పై అరిచాడు దాంతో త్రివిక్రమ్ కూడా అతనిపై కొంచెం కోపానికి వచ్చాడు. దాంతో ఇద్దరు కొత్త వాళ్లే కాబట్టి డైరెక్టర్ వాళ్ళిద్దరిని పిలిచి గొడవ పడొద్దు అని చెప్పి పక్కకు పంపించాడట.
ఇక ఆ తర్వాత విక్రమ్ తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే త్రివిక్రమ్ తెలుగులో స్టార్ రైటర్ గా తన సత్తా చాటుతూ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపుని సంపాదించుకొని డైరెక్టర్ గా కూడా తన స్టామినా ఏంటో ప్రూవ్ నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇద్దరు కూడా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్లు గా కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా చేయొచ్చు కానీ త్రివిక్రమ్ ఇప్పుడు ఆయనతో సినిమా చేసే ఉద్దేశ్యం లో లేడు ఎందుకంటే మొదట్లో వీళ్ళిద్దరూ పడిన గొడవే దానికి కారణం అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక వీళ్లిద్దరూ గొడవ పడినప్పుడు అక్కడ లైవ్ లో ఉన్న చాలామంది నటులు ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఇక వాళ్ల ద్వారానే ఈ విషయం లీక్ అయి ఫిలింనగర్ సర్కిల్ లో ఎక్కువగా వైరల్ అవుతుంది.ఇక ఇండస్ట్రీలో ఎవరితో గొడవ పడకుండా కామ్ గా ఉంటే అందరూ బాగుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తే మంచిదని పలువురు సినిమా పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే విక్రమ్ మాత్రం మంచి నటుడు పాన్ ఇండియా రేంజ్ లో తన నటన ప్రతిభని చాటుకున్నాడు…