https://oktelugu.com/

Harihara Veeramallu : హరిహర వీరమల్లు సినిమాను ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారో తెలుసా..?

మరి ఇటు ఎలక్షన్స్, అటు సినిమా బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఖాళీగానే ఉంటాడు. కాబట్టి ఈ ఖాళీ సమయం లో ఈ సినిమాని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2024 / 09:53 PM IST

    Harihara Veeramallu

    Follow us on

    Harihara Veeramallu : ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రం హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా భారీ క్రేజ్ ను అందుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే ఈయన చేస్తున్న సినిమాలు మొత్తం అన్ని కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఇక గత సంవత్సరం బ్రో సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ అది అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు.

    ఇక దాంతో ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. ఇక ఈ మూడు సినిమాలను ఈ సంవత్సరంలో రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో హరిహర వీరమల్లు సినిమాను గత నాలుగు సంవత్సరాల కిందటే స్టార్ట్ చేశాడు. అయినప్పటికీ ఆ సినిమాకి సరైన డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సినిమా రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఇది మరీ లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నట్టుగా సమాచారమైతే వస్తుంది. ఇక దాంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు అనే దానిమీద కూడా చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి దర్శకత్వ శాఖ మీద మంచి అవగాహన ఉంది. ఇక ఇప్పటికే ఆయన జానీ సినిమాను తీశాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ డైరెక్షన్ పరంగా పవన్ కళ్యాణ్ కి మాత్రం మంచి పేరు అయితే వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి తను మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.

    మరి ఇటు ఎలక్షన్స్, అటు సినిమా బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఖాళీగానే ఉంటాడు. కాబట్టి ఈ ఖాళీ సమయం లో ఈ సినిమాని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…