
Chiranjeevi – Pawan Kalyan : సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ త్రో బ్యాక్ ఫోటో వైరల్ అవుతుంది. అది ఎప్పుడో 90లలో తీసింది. సదరు ఫొటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెరీ యంగ్ ఏజ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఓ వ్యక్తితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మెగా బ్రదర్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఆయనెవరో కాదు గోర్తి సత్యమూర్తి. ఈయన ఒకప్పుడు స్టార్ రైటర్. బడా డైరెక్టర్స్ వద్ద, బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేశారు.
కే. రాఘవేంద్రరావు కెరీర్లో దేవత అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది. ఆ చిత్ర రచయిత జి. సత్యమూర్తి కావడం విశేషం. ఇక చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, అభిలాష, ఛాలెంజ్ తో పాటు అనేక సూపర్ హిట్ చిత్రాలకు ఆయన రచయిగా పనిచేశారు. స్క్రీన్ రైటర్ గా, డైలాగ్, కథా రచయితగా ఆయన 50 చిత్రాల వరకూ పని చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జానీ, గుడుంబా శంకర్ చిత్రాలకు కూడా ఆయన పని చేయడం విశేషం.
జి. కృష్ణమూర్తి చివరి చిత్రం మధుమాసం. 2007లో ఈ చిత్రం విడుదలైంది. ఆయన 2015 డిసెంబర్ నెలలో గుండెపోటుతో మరణించారు. ట్విస్ట్ ఏమిటంటే… జి కృష్ణమూర్తి ఎవరో కాదు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి కన్న తండ్రి. సత్యమూర్తికి ఇద్దరు కుమారులు పెద్దబ్బాయి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. ఇక చిన్నబ్బాయి సాగర్ సింగర్ గా ఉన్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని తీసుకుని దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిశ్రమలో అడుగు పెట్టారు.
పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ 1999లో విడుదలైన దేవి చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఖడ్గం, మన్మధుడు, వర్షం, వెంకీ, ఆర్య… దేవిశ్రీకి ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్… రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ ని ఏలుతున్నారు. మణిశర్మ తర్వాత టాప్ పొజిషన్ ఆయన కైవసం చేసుకున్నారు. దేవిశ్రీ సింగర్, లిరిసిస్ట్ కూడాను. దేవిశ్రీ ఇంకా వివాహం చేసుకోలేదు.