Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి (Rajamouli) చాలా తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఆయన చేసిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి పెంచడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సీనియర్ ఎన్టీఆర్ (Sr. NTR), సావిత్రి(Savithri) లతో సినిమాలు చేయాలని ఉందని ఇప్పుడు అది పాజిబుల్ కాదని అది అతనికి ఎప్పటికీ తీరని లోటని మరి మొత్తానికైతే రాజమౌళి లెజెండరీ యాక్టర్లతో నటించే మంచి అవకాశాన్ని కోల్పోయనని కూడా చెప్పడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఎన్టీయార్ సావిత్రిలు ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏక ఛత్రదిపత్యం తో ఏలిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ ఇద్దరు లెజెండరీ ఆర్టిస్టులు కూడా ప్రస్తుతం ఇండస్ట్రి లో లేకపోవడం తీరని లోటుగా చెప్పొచ్చు.
మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు ఉంటే మాత్రం రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ వాళ్ళతో పెను ప్రభంజనాలను సృష్టించే సినిమాలు చేసేవాడు అంటూ సగటు ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయికి కూడా తెలుగు సినిమాని తీసుకెళ్లడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా హాలీవుడ్ ఇండస్ట్రీతో పోటీ పడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక అలాగే ఒక తెలుగు డైరెక్టర్ హాలీవుడ్ దర్శకుల పక్కన నిలబడబోతున్నాడు అనేది కూడా వాస్తవం…ఈ సినిమాతో రాజమౌళి పెను ప్రభంజనాలను సృష్టిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి తొందర్లోనే సినిమాని పూర్తి చేసి 2027 లో సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే 2027లో ఈ సినిమా వస్తుందా లేదంటే మరింత లేటయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
