Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన లాంటి దర్శకుడు చేసిన ప్రతి సినిమాలు కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. ఈ మొదట గా ఆయన చేసిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా మంచి విజయానైతే సాధించింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్టు పట్టుకొని ఆయన దాదాపు 5 సంవత్సరాలుగా ఒక ప్రొడ్యూసర్ దగ్గరకి తిరిగి తన టైమ్ ని వేస్ట్ చేసుకున్నాను అని తెలిసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ వాళ్ళ ఫాదర్ అతన్ని చూసి అన్నయ్య సందీప్ వాళ్ల అన్నయ్య అయినా ప్రణయ్ రెడ్డితో వాడు సినిమా సినిమా అంటూ పిచ్చివాడు అయ్యేలా ఉన్నాడు. వాని సినిమాకి ఎంత డబ్బులు కావాలో అది ఇచ్చేసి సినిమా చేయండి..ఆ డబ్బులు తిరిగి రాకపోయినా పర్లేదు కానీ వాడు మాత్రం సినిమా చేయాలి లేకపోతే వాడు పిచ్చోడిలా మారేలా ఉన్నాడు అంటూ వాళ్ళ నాన్న చెప్పడంతో వాళ్ళ అన్నయ్య ప్రణయ్ రెడ్డి ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గా మారాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే తన పక్కనున్న ఫ్రెండ్ తో సందీప్ వంగ ఒకవేళ ఈ సినిమా ఆడకపోతే నేను ఆస్ట్రేలియా అయినా వెళ్ళిపోతాను, లేదంటే వరంగల్ వెళ్లి మా నాన్న చేసే కాటన్ మిర్చి బిజినెస్ చేసుకుంటూ కూర్చుంటాను తప్ప ఇండస్ట్రీలో మాత్రం ఉండనని చెప్పారట.
దాంతో అతని ఫ్రెండ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అనడం అప్పుడు దానికి సందీప్ సమాధానంగా మనం ఇంత తీసారీస్ రాసి సినిమాను చేసిన తర్వాత కూడా మన సినిమా ఆడకపోతే ఇంకెవరి సినిమా ఆడుతుంది.
ఒక వేళ అది ఆడకపోతే మనకు అవమానమే కదా అని చెప్పాడట…మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తను తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే…