Rajinikanth Coolie Movie Remuneration: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. వాళ్లకు ఉన్న స్టార్ డమ్ ను బట్టి ఆ సినిమాల బడ్జెట్ ను బట్టి డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే సీనియర్ హీరోలందరు తీసుకునే రెమ్యూనరేషన్ ఒకెత్తయితే తమిళ్ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ తీసుకునే రెమ్యూనరేషన్ మరొక్క ఎత్తుగా మారుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఆయన గత కొన్ని రోజుల నుంచి వస్తున్న సినిమాలన్నింటికి 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రతి ప్రొడ్యూసర్ కూడా సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఆయన ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా విషయంలో 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ తీసుకుంటూ ఉండడం విశేషం…
ఇక కూలీ సినిమా కోసం 100 కోట్లు మాత్రమే తీసుకున్నారట. దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే చాలు.. అనే ఉద్దేశ్యంతో ఆయన 100 కోట్లు మాత్రమే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికైతే రజనీకాంత్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది.
Also Read: రజినీకాంత్ హీరోగా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా..? కారణం ఏంటంటే..?
కానీ అలా చేయకుండా 100 కోట్లు మాత్రమే తీసుకున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటికీ రజనీకాంత్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఇప్పటికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ అంటే తెలియని వారు ఎవరూ లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రోబో సినిమాతో మొదటి పాన్ ఇండియా సినిమాను చేసిన ఆయన మొదటి అడుగుతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఆ తర్వాత రోబో 2 సినిమాతో 700 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన ఆయన మంచి సినిమా పడితే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి రాబోయే సినిమాలతో 1000 కోట్ల మార్కు ను టచ్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…