https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు కెరియర్ లో డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఏంటో తెలుసా..?

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఒక్క డ్యూయల్ రోల్ పాత్ర లోకూడా నటించలేదు అనేది మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : September 25, 2023 / 02:22 PM IST
    Follow us on

    Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగం గానే ప్రతి హీరో తన క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది కూడా చాలా దగ్గరుండి డైరెక్టర్లతో మాట్లాడి దానికి సంభందించిన మేకోవర్ చూసుకుంటూ సినిమాలు చేస్తాడు.ఇక అలా ఇండస్ట్రీ లో సీనియర్ ఎన్టీయార్ నుంచి జూనియర్ ఎన్టీయార్ వరకు ప్రతి హీరో కూడా వాళ్ళ కేరియర్ లో ఒక్కసారైనా డ్యూల్ రోల్ లో నటించారు.

    అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఒక్క డ్యూయల్ రోల్ పాత్ర లోకూడా నటించలేదు అనేది మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది.అయితే ఇది చాలా మంది అనుకునే మాట కానీ ఆయన ఎంటైర్ సినిమా కెరియర్ లో ఎప్పుడు కూడా ఫుల్ లెంత్ డ్యూయల్ రోల్ లో నటించలేదు ,కానీ ఆయన చేసిన ఒక సినిమా లో మాత్రం ఒక చిన్న డ్యూయల్ రోల్ పాత్ర లో కొద్దిసేపు అలా నటించి మంచి గుర్తింపు ని తెచ్చుకున్నాడు…

    ఆ సినిమా ఏంటి అంటే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో వచ్చిన నాని సినిమా. ఆయన ఈ సినిమాలో చివర్లో కొద్దిసేపు తండ్రి కొడుకులు గా డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు.అయితే ఈ సినిమా అప్పటి వరకు ఉన్న రొటీన్ సినిమాలకి బిన్నంగా రావడం తో ఈ సినిమా అప్పట్లో జనాలకి పెద్దగా నచ్చలేదు, అదొక రీజన్ అయితే ఒక్కడు సినిమా వల్ల మహేష్ కి వచ్చిన మాస్ ఇమేజ్ వచ్చింది దాని తర్వాత ఈ సినిమా రావడం తో జనాలు ఈ సినిమాని ఆ సినిమాతో పోల్చి చూడటం తో ఈ సినిమా ఎక్కువ మంది జనాలకి నచ్చలేదు. దాంతో ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే మహేష్ బాబు తన కెరియర్ లో ఒక్కసారి కూడా డ్యూయల్ రోల్ లో నటించలేదు అని చాలా మంది అభిప్రాయం పడుతుంటారు.కానీ ఈ సినిమా నటించిన విషయం చాలా మంది కి తెలీదు.ఈ సినిమాకోసం మహేష్ బాబు చాలా కష్టపడినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..అయితే ఈ సినిమా అనే కాదు మహేష్ బాబు కృష్ణ తో కలిసి ఆయన ఫుల్ టైం హీరో గా సినిమా చేయక ముందే చిన్నతనం లోనే కృష్ణ ,విజయ శాంతి కాంబినేషన్ లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సినిమా లో డ్యూయల్ రోల్ లో నటించాడు. కానీ ఈ సినిమా లో హీరో కృష్ణ కాబట్టి ఇది కంప్లీట్ గా మహేష్ బాబు సినిమా కాదు కాబట్టి ఆయన కెరియర్ లో ఫుల్ టైం హీరో గా మారిన తర్వాత ఆయన డ్యూయల్ రోల్ లో చేసిన సినిమా నాని సినిమా ఒక్కటే…

    ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన మంచి విజయం అందుకోవాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా కూడా చేయబోతున్నాడు…