https://oktelugu.com/

Soundarya : సౌందర్య భర్త ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా..?

ఇక అన్ని సంవత్సరాలపాటు సౌందర్య జ్ఞాపకాలతోనే బతికిన ఆయన ను చూసిన జనాలు ఆయనకి సౌందర్య అంటే ఎంత ఇష్టం ఉందో అంటూ అప్పట్లో ఆయన మీద కొంతవరకు జాలి చూపించారు. ఇక మొత్తానికైతే ఆయన ఒక ఇంటివాడు అవడం అనేది అందరికీ సంతోషాన్నిచ్చే విషయం అనే చెప్పాలి. అయితే ఆయన ప్రస్తుతం గోవాలో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 01:25 PM IST

    Soundarya

    Follow us on

    Soundarya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘మహానటి సావిత్రి’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఒకప్పుడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చాలా మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంది.

    ఇక ఇలాంటి క్రమంలోనే సావిత్రి ఫేడ్ అవుట్ అయిపోయిన రెండు దశాబ్దాల తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య కూడా తనదైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈమె ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేయకుండా సంప్రదాయ బద్ధమైన దుస్తులను ధరిస్తూ తను చాలామంది ప్రేక్షకులను తమ అభిమానులుగా మార్చుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఇక ఆమె ఏ హీరోతో యాక్ట్ చేసిన ఆ హీరోకి తగ్గట్టుగా తన యాక్టింగ్ స్కిల్స్ ను అప్డేట్ చేసుకుంటూ వచ్చేది.

    ఇక మొత్తానికైతే తను తన మేనమామ అయిన రఘు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని 2003 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ల పెళ్లి అయిన సంవత్సరం గడవక ముందే తను హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అనేది తన అభిమానులను చాలా వరకు తీవ్రమైన బాధ కు గురి చేసిందనే చెప్పాలి. ఇక ఈమె మరణం తర్వాత తన భర్త ఆయన రఘు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దాదాపు 11 సంవత్సరాల పాటు సౌందర్య జ్ఞాపకాలతో బతికిన రఘు 2014లో మరో మహిళను పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు.

    ఇక అన్ని సంవత్సరాలపాటు సౌందర్య జ్ఞాపకాలతోనే బతికిన ఆయన ను చూసిన జనాలు ఆయనకి సౌందర్య అంటే ఎంత ఇష్టం ఉందో అంటూ అప్పట్లో ఆయన మీద కొంతవరకు జాలి చూపించారు. ఇక మొత్తానికైతే ఆయన ఒక ఇంటివాడు అవడం అనేది అందరికీ సంతోషాన్నిచ్చే విషయం అనే చెప్పాలి. అయితే ఆయన ప్రస్తుతం గోవాలో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది…