Adipurush OTT
Adipurush OTT: కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం చిత్రం పై ఉన్న అంచనాలను పదింతలు ఎక్కువ అయ్యేలా చేసింది. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సెరిటిఫికేట్ ని తెచ్చుకున్న ఈ సినిమా 2D మరియు 3D ఫార్మటు లో కూడా విడుదల కాబోతుంది.
3D కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్ హిందీ వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ విషయం లో మేకర్స్ చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
అదేమిటంటే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై 8 వారాలు పూర్తి అయినా తర్వాతే ఓటీటీ లో విడుదల చేసేందుకు అనుమతిని ఇస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది.సుమారుగా 150 కోట్ల రూపాయలకు తెలుగు , హిందీ , తమిళం , మలయాళం మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేసే హక్కులను పొందిందని సమాచారం.
ఈమధ్య కాలం లో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా నెల రోజుల లోపే ఓటీటీ లో వచ్చేస్తుంది. అలాంటిది 8 వారాల తర్వాత ఓటీటీ విడుదల అంటే మాకు నష్టం కలుగుతుందని, దయచేసి 8 వారలను కాస్త నాలుగు వారాలు చెయ్యమని అమెజాన్ ప్రైమ్ సంస్థ రిక్వెస్ట్ చేసినా కూడా మేకర్స్ ఒప్పుకోలేదట. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే నాలుగు వారాల్లో స్ట్రీమింగ్ చెయ్యడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది.