Anand Child Artist: ‘ఆనంద్’లోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తుందో.. ఎలా ఉందో తెలుసా?

శేఖర్ కమ్ముల సినిమాను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. క్లాసికల్ ను టచ్ చేస్తూనే ఏమోషనల్ ను తెప్పిస్తుంటారు. ఆయన తీసే ప్రతీ సినిమాలో దాదాపు కొత్తవారు ఉండేలా చూసుకుంటారు.

Written By: Srinivas, Updated On : September 29, 2023 2:41 pm
Follow us on

Anand Child Artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెరిగి పెద్దయ్యాక హీరో, హీరోయిన్లుగా మారారు. కొందరు చిన్నప్పుడు ఒకటి, రెండు సినిమాల్లో నటించి ఆ తరువాత కనిపించకుండా పోతారు. కానీ వీరి నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంటారు. శేఖర్ కమ్ముల మూవీ ‘ఆనంద్’ సినిమా దాదాపు సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. మంచి క్లాసికల్ మూవీ అనిపించుకున్న ఈ సినిమాల్లోని నటులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఓ అమ్మాయి నంది అవార్డును కూడా తెచ్చుకుంది. అయితే అమె అందరిలా పెద్దయ్యాక హీరోయిన్ కాలేదు. మరేం చేస్తుందో తెలుసా?

శేఖర్ కమ్ముల సినిమాను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. క్లాసికల్ ను టచ్ చేస్తూనే ఏమోషనల్ ను తెప్పిస్తుంటారు. ఆయన తీసే ప్రతీ సినిమాలో దాదాపు కొత్తవారు ఉండేలా చూసుకుంటారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టగా నిలిచింది ‘ఆనంద్’ మూవీ. ఇందులో రాజా హీరోగా నటించగా.. హీరోయిన్ గా కమలిని ముఖర్జీ నటించింది. రాజా అంతకుముందే పలు సినిమాల్లో నటించారు. కమలిని ముఖర్జీకి మాత్రం ఇది డెబ్యూ మూవీనే. ఫస్ట్ మూవీతోనే కమలిని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ మూవీలో ఆనంద్ ఓ ఇంట్లోకి రెంట్ కు దిగుతాడు. ఆ ఇంట్లో ఓ చిన్నారి అందరినీ అలరిస్తుంది. ‘సమత’ పాత్రలో నటించిన ఈమె పేరు బఖిత ఫ్రాన్సిస్. ఈ సినిమాలో హీరోయిన్ తో సమానంగా నటించింది బఖిత. ఆమె నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. బఖిత ఈ మూవీ తరువాత మరే సినిమాలో నటించలేదు. అంతేకాకుండా ఆమె పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావాలని అనుకోలేదు. కానీ ఆమె ఏ నటి తీసుకోని నిర్ణయం తీసుకున్నారు.

బఖిత ప్రాన్సిస్ కు ప్రస్తుతం 26 ఏళ్లు. ఈమె చిన్నప్పటి నటి అయినా ప్రస్తుతం సినిమాల వైపు వెళ్లాలనుకోవడం లేదు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తుంది. వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోరాడుతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ సమాజ సేవ గురించి పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే మళ్లీసినిమాల్లోకి వస్తారా? అని కొందరు అడగగా.. తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది