Thammudu Movie: ‘పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎనలేని అభిమానం కొందరికి. సినిమా స్టోరీ ఎలా ఉన్నా పవన్ నటన కోసమే థియేటర్లోకి వచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకే పవన్ వరుస హిట్ల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ తరువాత గోకులంలో సీత లో నటించారు. ఈ సినిమా యావరేజ్ గా నడిచింది. అయతే ఆ తరువాత తొలిప్రేమ బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఇదే ఊపులో పవన్ ‘తమ్ముడు’ సినిమాలో నటించారు. ఈ సినిమా సక్సస్ కావడంతో పవన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఆ సమయంలోనే రూ.13 కోట్ల వసూలు చేసింది. ఈమూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తమ్ముడు సినిమా అప్పట్లో యూత్ లో సంచలనం. యాక్షన్, ఎమోషనల్, లవ్ ఫీలింగ్స్ తో పాటు కామెడీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినమాకు కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. మధ్యతరగతి కుర్రాడిగా పవన్ ఇందులో నటించారు. మధ్యతరగతి యూత్ ఎలా ఉంటారో.. అలాగే పవన్ లీనమైపోయాడు. అయితే పవన్ తో పాటు అతని స్నేహితులుగా మరికొంతమంది నటించిన విషయం తెలిసిందే. వారిలో ఆలీ ప్రధానంగా కనిపిస్తారు. ఆయనతో పాటు జుమాంజి పాత్రలో ఓ వ్యక్తి నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
కళ్ల వరకు ఉండే హెయిర్ స్టైల్ లో ప్రత్యేకంగా ఉండే ఇతను డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఎంతో అమాయకుడిలా నటించిన ఈయన పేరు శివ. ఆ సమయంలో ఈయన స్టడీస్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇదే సమయంలో ఆయన స్నేహితుడు పీ అరుణ్ ప్రసాద్ ‘తమ్ముడు’ సినిమాను తీశారు. ఇందుతో తన స్నేహితుడిని వెండితెరపై చూడాలనుకొని పవన్ స్నేహితుడిలా ఇందులో అవకాశం ఇచ్చాడు. అయితే శివ ఈ సినిమా తరువాత మళ్లీ ఎందులోనూ కనిపించలేదు. ఎందుకంటే?
శివ హైయ్యర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లాడు. ఆ తరువాత ఓ సాఫ్ట్ వేర్ జాబ్ చేశాడు. ప్రస్తుతం ఆయనకు సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. గత నాలుగేళ్లనుంచి ఈ కంపెనిని ఆయన సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. శివకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ తన ఫ్రెండ్ కోరిక మేరకు ‘తమ్ముడు’ సినిమాలో నటించారు. కానీ ఆ తరువాత అతను ట్రై చేస్తే సినిమాల్లో అవకాశం వచ్చేది. కానీ ప్రయత్నించలేదు. అలాగే తనకంటూ సోషల్ మీడియా లేదు. దీంతో ఆయన పిక్స్ బయటకు రాలేదు. కానీ వివరాలు మాత్రం ఎవరో బయటపెట్టారు.