Homeఆంధ్రప్రదేశ్‌BJP - TDP : బీజేపీ ఓట్లు టీడీపీకి పడుతాయా? నిజమెంత?

BJP – TDP : బీజేపీ ఓట్లు టీడీపీకి పడుతాయా? నిజమెంత?

BJP – TDP : పొత్తు అనేది ఉభయతారకంగా ఉండాలి. రెండు పార్టీల ఓటు బ్యాంక్ సర్దుబాటు కావాలి.బదలాయింపు సక్రమంగా జరగాలి. లేకుంటే మాత్రం పొత్తు ఎట్టి పరిస్థితుల్లో వర్కవుట్ కాదు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు విషయంలో అటువంటి ఆలోచనలే బయటకు వస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య సుదీర్ఘ కాలం పొత్తు నడిచింది. చాలా సందర్భాల్లో ఇది వర్కవుట్ అయ్యింది కూడా. కానీ ఉభయులు వ్యవహరించిన తీరుతో కొన్నిసార్లు దారుణ ఫలితాలు వెలుగుచూశాయి. 2004, 2009 ఎన్నికల్లో పొత్తు ఉన్నా రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగలేదు. దీంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

సుదీర్ఘ కాలం తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో వీరి కలయిక పొలిటికల్ హీట్ ను పెంచింది. భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా కూడా మీటింగ్‌కి విపరీతమైన ప్రచారం ఇచ్చింది. ముఖ్యంగా బీజేపీ తో పొత్తుల కు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఆయన వ్యూహాలు ఏంటో తెలియడంలేదు కానీ వెళ్ళి వెళ్ళి కమలం పార్టీ ఉచ్చులో చిక్కుకున్నారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.  రెండు పార్టీల కలయికతో ప్రయోజనం ఎవరికి అంటే రెండు పార్టీల కు నష్టమే అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇక చంద్రబాబు కు అది ఇంకా పెద్ద నష్టం అని కూడా అంటున్నారు.

తెలంగాణా లో టీడీపీ బీజేపీ ని అధికారం లోకి తెస్తుందా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. గతంలో మాదిరిగా తెలంగాణలో టీడీపీకి బలం లేదన్నది వాస్తవం. తెలుగుదేశం బలమంతా బీఆర్ఎస్ లోకి షిఫ్ట్ అయ్యింది. 2014 తరువాత టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అటు తరువాత  జరిగిన రెండు జీ హెచ్ ఎం సీ ఎన్నికలు,  మరో రెండు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఏమంత బలం చూపలేకపోయింది.  వాస్తవానికి తెలంగాణ లో టీడీపీ ని గెలిచే పార్టీగా ఎవరూ చూడడంలేదు అంతే కాదు ఉనికి ని చాటుకునే పార్టీగానే చూస్తున్నారు.  టీడీపీ పై అభిమానం ఉన్నవారు సైతం ఓడిపోయే పార్టీకి ఎందుకు ఓటు వేయడం అని ఆలోచిస్తున్నారు.

ఏపీ లో బీజేపీ వల్ల టీడీపీకి ప్రయోజనం ఏమైనా ఉందంటే అదీ లేదు. అలాంటి పార్టీ తో పొత్తు పెట్టుకుని వెళ్తే జనాల్లో వ్యతిరేకత బాగా ఎక్కువ అవుతుందని అది చివరి కి టీడీపీ పుట్టె ముంచుతుంది అని అంటున్నారు. బీజేపీ మీద ఏపీ జనాలు గుర్రు మీద ఉన్నారు. విభజన హమీలు తీర్చలేదని,  ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఏపీ ని ఏ విధంగానూ ఆదుకోలేదని వారు మండిపడుతున్నారు.పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టడం మీద అయితే మండిపోతున్నారు. అలాంటి పార్టీతో అంటకాగితే టీడీపీ ని కూడా దూరం పెడతారు అని అంటున్నారు. ఏపీ లో జనసేన, బీజేపీ ని టీడీపీ తో కలపడానికి చూస్తోంది. ఆ పార్టీ లోకి వెళ్ళిన మాజీ టీడీపీ తమ్ముళ్ళు కూడా అదే పని లో ఉన్నారు. ఒక వేళ పొత్తు కుదిరినా ఓట్లు, సీట్లు సర్దుబాటయ్యే చాన్సే లేదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version