Samantha First Night Gift: అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పట్టుమని పదేళ్లు కూడా కాపురం చేయకుండానే విడిపోయారు. కారణాలేవైనా వారి విడాకులు అందరిలో ఆందోళన పెంచాయి. కలకాలం కలిసుంటారని భావించినా కొంత కాలానికే వారు దూరంగా ఉండటం అందరిలో ఆశ్చర్యాన్నికలిగించింది. సినిమా వాళ్లు చాలా మంది పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నా వీరు మాత్రం రాజీ పడక విడిపోవడంపై అందరు పెదవి విరిచారు. చూడముచ్చటైన జంట అందరు భావించినా వారి బంధం మధ్యలోనే విడిపోవడంపై జీర్ణించుకోలేకపోయారు. వారి బంధం కలకాలం నిలవాలని ఆశించినా కుదరలేదు. విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

విడాకులు తీసుకునే మూడు నెలల ముందు నుంచే సమంత, చైతు విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికే వారు ఇచ్చుకున్న బహుమతులను మార్చుకున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరి వద్ద ఉన్న వస్తువులను ఇచ్చిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు వారు రాసుకున్న లవ్ లెటర్స్ ను కూడా ఎవరివి వారు తీసుకున్నారు. ఇక విడాకుల తరువాత కెరీర్ పరంగా ఎవరికి వారు దూసుకుపోతున్నారు. తమదైన శైలిలో సినిమాలు చేస్తూ ఒకరికంటే మరొకరు పోటీతత్వంతో సినిమాలు చేస్తున్నారు.
Also Read: Sonam Kapoor: మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్… తాతగా మారిన స్టార్ హీరో.. సంబరాల్లో ఫ్యాన్స్
విడాకుల కంటే ముందే తమ వద్ద ఉన్న తీపి గుర్తులను చెరిపేసుకున్నారు. నాగచైతన్య ఇచ్చిన బహుమతులను సమంత దూరం చేసుకుంది. పెళ్లిలో ఇచ్చిన చీరను మాత్రం అత్తకు ఇచ్చేసిందట. తొలిరాత్రికి ఇచ్చిన గిఫ్ట్ ను మాత్రం తన మేనేజర్ ద్వారా చైతుకు ఇచ్చిందట. దీంతో వారి మధ్య ప్రస్తుతం ఎలాంటి గుర్తులు లేకుండా చేసుకున్నారని తెలుస్తోంది. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వారి కెరీర్ ను మలుచుకుంటున్నారు. విడాకుల ప్రకటనకంటే ముందే వారు అన్ని సర్దుకున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనస్పర్దల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ విడాకుల తరువాత చైతన్యతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటోంది. చైతు ఇచ్చిన బహుమతులు అన్ని వదులుకున్నా అతడితో కలిసి ఉన్న ఇంటిని మాత్రం ఇప్పటికి వదలడం లేదు. అదేమిటంటే ఆ ఇల్లు తనకు అనుకూలంగా ఉందని చెబుతోంది. దీనిపై అప్పట్లోనే ఎన్నో విమర్శలు వచ్చినా సమంత మాత్రం ఆ ఇంట్లోనే నివాసం ఉండటం అందరికి అనుమానాలు కలిగిస్తోంది.