Mahesh Babu Varanasi Movie: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు… ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్ లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించాడు… ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో మహేష్ బాబు చాలా రొటీన్ సినిమాలను చేస్తున్నాడు అంటూ చాలా విమర్శలైతే ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు రాజమౌళితో చేయబోతున్న వారణాసి సినిమాతో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఇందులో ఐదు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి పాత్ర ఒక ప్రత్యేకంగా నిలిచిపోతుందట…
ఇక మహేష్ బాబు చేత ఈ పాత్రలో నటింప చేయడానికి రాజమౌళి భారీ ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వారణాసి సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ గ్లింప్స్ లో మహేష్ బాబు అరిచే సన్నివేశం ఉంటుంది… దానికోసం రాజమౌళి ముందుగా మహేష్ బాబు చేత ఒక 100 సార్లు గత్తిగా అర్పించారట. అరిచి అరిచి మహేష్ బాబు గొంతు పోయిన తర్వాత ఆ పాత్రకి డబ్బింగ్ లో మరోసారి అర్పించినట్టుగా తెలుస్తోంది.
అంటే మహేష్ బాబు గొంతు మొదట సాప్ట్ గా రావడంతో అలా అయితే వర్కౌట్ కాదని కొంచెం రఫ్ గా రావడం కోసం ఇలా చేశాడట…మొత్తానికైతే ఒక్క అరిచే సన్నివేశం కోసమే రాజమౌళి మహేష్ బాబుని అంత టార్చర్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి సినిమా కోసం ఇంకెంత టార్చర్ పెడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు… మొత్తానికైతే ఈ సినిమా కోసం మహేష్ బాబు తీవ్రంగా కష్టపడుతున్నాడట.
ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి తన కెరియర్ లోనే ఒక అత్యుత్తమమైన సినిమాగా ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఉన్నాడట. తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తానని మహేష్ బాబు తన ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించి మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…