Bandla Ganesh: బండ్ల గణేష్ మొదట నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. చాలా తక్కువ సమయంలోనే టాప్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొన్నాడు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ప్రొడ్యూసర్ గా సినిమాలను చేయడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా మరోసారి ఆయన సినిమాలను చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక అందులో భాగంగానే ఈరోజు BG Block Busters (బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్) అంటూ తన బ్యానర్ నేమ్ ని అనౌన్స్ చేశాడు. గతంలో పరమేశ్వర ఆర్ట్స్ పేరుతో ఉన్న బ్యానర్ ని ఇలా మార్చాడు. కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తానని హీరోలతో సంబంధం లేదని కంటెంట్ మాత్రమే ఇక్కడ మాట్లాడుతుందని బండ్ల గణేష్ కామెంట్లు చేశాడు.
మొత్తానికైతే ఈ సంవత్సరం చిన్న సినిమాలతో చాలామంది దర్శకులు గొప్ప విజయాలను సాధించారని అలాంటి కంటెంట్లతో వస్తే నేను కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అందుకోసమే నేను ఈ బ్యానర్ ని స్థాపించాను అంటూ ఆయన చెప్పాడు.
కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న బండ్ల గణేష్ ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలను చేస్తాడు. తన బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ఒక ఐడెంటిటి ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక గతంలో ఆయన గబ్బర్ సింగ్, టెంపర్, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలను చేసి ఆయా హీరోలకు గొప్ప విజయాలను సాధించి పెట్టాడు…
తనకి ప్రొడక్షన్ మీద, కథల మీద మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి సినిమాల్లో గొప్ప కథలను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ బ్యానర్ ని స్థాపించానని చెప్పడం విశేషం… స్టార్ హీరోలతో సినిమాలను చేసి కోట్ల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి అంతో ఇంతో లాభాన్ని పొందే కంటే తక్కువ బడ్జెట్లో సినిమాను చేసి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడితే అందులో మంచి కిక్ ఉంటుందని ఆయన పలు సందర్భాల్లో కూడా తెలియజేశాడు…