Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన ఆయన రీతిలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే దానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక యూత్ లో భారీ స్టార్ డమ్ ని పొందిన హీరోలలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ కి మొదట్లో సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ లేదట. ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చిన అతను డైరెక్టర్ అవుదామనే కోరికతో ఉండేవాడు. కానీ అనుకోని కారణాలవల్ల చిరంజీవి ఫోర్స్ తో ఆయన హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఒకసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సక్సెస్ అయి చూపించాలి. లేకపోతే అది చిరంజీవికి అవమానంగా మారుతుందనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగడమే కాకుండా వరుస సక్సెస్ లను కూడా అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన జనసేన అనే పార్టీ పెట్టి రాజకీయంగా కూడా ఎదుగుతూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి కనక రాకపోయి ఉంటే ఆయన సన్యాసం తీసుకొని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడని పవన్ కళ్యాణ్ ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒకవేళ సన్యాసుల్లో కలవకపోతే కొంత భూమిని తీసుకొని వ్యవసాయం చేసుకునే వాడినని కూడా ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలియజేయడం విశేషము…
ఇక మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిని మించి స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక జనాల్లో కూడా ఆయన మీద భారీ నమ్మకం అయితే ఉంది. అందువల్లే అతన్ని డిప్యూటీ సీఎం గా ఎదిగేంతవరకు వాళ్లు అతని వెనుక ఉండి ఆయనకు తీవ్రంగా సపోర్ట్ చేశారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆయన తనను తాను మరొకసారి గొప్ప లీడర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాళ్ళకి న్యాయం కల్పించడం కోసం ఆయన ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక దాంట్లో భాగంగానే ఆయన చాలా సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నాడు. చూడాలి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో సీఎం అవుతాడా లేదా అనేది…