Chiranjeevi Sacrifice For Venkatesh: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సంక్రాంతి మూవీ ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఫామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కి ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యేలా చేసింది ఈ చిత్రం..2005 వ సంవత్సరం ఫిబ్రవరి 18 వ తారీఖున విడుదల అయినా ఈ సినిమా కి అప్పట్లో ఫామిలీ ఆడియన్స్ నీరాజనాలు పలికారు..ఈ సినిమా లో హీరోయిన్లు గా స్నేహ, ఆర్తి అగర్వాల్ మరియు సంగీత నటించగా, వెంకటేష్ కి తమ్ముళ్లుగా శ్రీకాంత్, శివ బాలాజీ మరియు శర్వానంద్ లు నటించారు..కుటుంబం లో చోటు చేసుకునే ప్రేమ , ఆప్యాయతలను చాలా చక్కగా చూపించాడు ఆ చిత్ర దర్శకుడు ముప్పలనేని శివ..ఇది ఇలా ఉండగా ఈ సినిమా 2001 వ సంవత్సరం లో తమిళం లో తెరకెక్కిన ఆనందం అనే సినిమాకి రీమేక్..తమిళ్ లో వెంకటేష్ పోషించిన పాత్రని మమ్మూటీ పోషించాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే తొలుత ఈ సినిమాని ముప్పలనేని శివ మెగాస్టార్ చిరంజీవి తో చేద్దాం అని అనుకున్నాడట..స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత ‘కథ చాలా బాగుంది..కానీ ఈ కథ నాకంటే వెంకటేష్ బాగా సూట్ అవుతుంది..అతనికి స్క్రిప్ట్ వినమని కాల్ చేసి చెప్తాను..వెళ్లి చెప్పు’ అని చెప్పాడట మెగాస్టార్ చిరంజీవి..ఇక ఆ తర్వాత ముప్పలనేని శివ వెంకటేష్ ని కలవడం, స్క్రిప్ట్ చెప్పడం ఆ తర్వాత షూటింగ్ జరగడం, సినిమా విడుదల అయ్యి భారీ హిట్ కొట్టడం అన్ని అలా జరిగిపోయాయి..అయితే చిరంజీవి చెప్పినట్టు ఈ సినిమా వెంకటేష్ కోసమే పుట్టినట్టు ఉంటుంది అని అనిపిస్తుంది..అంత చక్కగా ఆయనకీ ఆ స్టోరీ నప్పింది..కానీ తన తోటి స్టార్ హీరో అయినా వెంకటేష్ కోసం ఈ కథ వదిలేసుకోవడం చిరంజీవి గొప్పతనం కి నిదర్శనం అని ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..గతం లో కూడా ‘దాడి’ సినిమా స్టోరీ ని డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవి కి వినిపించినప్పుడు..ఈ స్టోరీ నాకంటే వెంకటేష్ కి బాగా సూట్ అవుతుంది కదా అని అన్నాడట చిరు..లేదు అండీ మీకు ఈ సినిమా చాలా బాగా సూట్ అవుతుంది..కచ్చితంగా మీరే చెయ్యాలి అని పట్టుబట్టి చేయించాడట ఆ చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ..ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో యావరేజి గ్రోస్సర్ గా నిలిచింది.



