Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి మనవాళ్లు క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజానికి పాన్ ఇండియాలో మన వాళ్ళు మార్కెట్ విపరీతంగా పెరగడానికి కూడా కారణం మన స్టార్ హీరోలనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు…
సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే హాలీవుడ్ లో వచ్చిన ‘స్క్విడ్ గేమ్ ‘ (Squid Game) వెబ్ సిరీస్ మంచి పాపులారిటిని సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు దీనికి స్కివెల్ గా ‘స్క్విడ్ గేమ్ 2’ (Squid Game2) కూడా వచ్చింది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఇది తెగ వైరల్ అవుతుంది. ఇక మొదటి వారంలోనే ఈ సీరీస్ 68 మిలియన్ల వ్యూస్ ను సంపాదించుకొని ఈ సిరీస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆసక్తికరమైన స్క్విడ్ గేమ్ సిరీస్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఉంటుంది.
మరి ఇదిలా ఉంటే కొంతమంది ప్రేక్షకులు ఈ గేమ్ లో మన తెలుగు హీరోలు ఉంటే ఎలా ఉంటారనే ఉద్దేశ్యంతో ఏఐ సహాయంతో స్క్విడ్ గేమ్ లోని కొంతమంది మన హీరోలు ఉన్నట్టుగా వారిని రిక్రియేట్ చేశారు. స్క్విడ్ గేమ్ లోకి మన హీరోలు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో రూపంలో చేసి నెట్లో పెట్టారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇందులో రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీయార్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, సూర్య, నాగార్జున, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, ధనుష్, విజయ్ దేవరకొండ, రానా లాంటి హీరోలు కనిపిస్తుండడం విశేషం… ఇక మొత్తానికైతే అభిమానులు తమ అభిమాన హీరోల ఫోటోలను చూసుకుంటూ ముచ్చట పడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా స్క్విడ్ గేమ్ అనేది మామూలు సిరీస్ అయితే కాదు. రెండు సీజన్లు గా వచ్చిన ఈ సిరీస్ యావత్ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సిరీస్ రాలేదు అంటూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ఈ సిరీస్ మీద ప్రశంసలను కురిపిస్తున్నారు. మరి ఇలాంటి ఒక బెస్ట్ సిరీస్ లో మన హీరోలు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి అలాంటి వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తికి నిజంగా కృతజ్ఞతలు అంటూ ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు…