Manchu Manoj EX Wife Pranathi: విలక్షణమైన కథలతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న హీరో మంచు మనోజ్..తొలి సినిమా నుండి చివరి సినిమా వరుకు మంచు మనోజ్ చిత్రాలు కాస్త రొటీన్ కి బిన్నంగా ఉంటాయి..ముఖ్యంగా ఇతని సినిమాల్లోని పాటలకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది..మంచు మోహన్ బాబు కుటుంబం లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగే కెపాసిటీ ఉన్న ఏకైక హీరో మంచు మనోజ్ మాత్రమే..కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ గత నాలుగేళ్ల నుండి ఇతగాడు సినిమాలకు పూర్తి గా దూరం అయ్యాడు..మొన్నీమధ్యనే ‘అహం బ్రహస్మి’ అనే చిత్రాన్ని ప్రారంభించి మధ్యలోనే ఆపేసాడు..ఇప్పుడు ఈయన ద్రుష్టి మొత్తం సినిమాలకంటే రాజకీయాల వైపే ఎక్కువగా ఉంది..అతి త్వరలోనే ఈయన రాజకీయ రంగ ప్రవేశం కూడా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇది పక్కన పెడితే ఈయన రెండేళ్ల క్రితం తన మొదటి భార్య లక్ష్మి ప్రణితి తో విడాకులు తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి మధ్య తరుచు విభేదాలు వస్తూ ఉండడం వల్ల కలిసి ఉంటూ ఇబ్బంది పడడం కంటే విడిపోయి సుఖంగా ఉండటమే బెటర్ అనుకొని ఇద్దరు విడిపోయారు..అప్పట్లో వీళ్లిద్దరి పెళ్లిని మోహన్ బాబు అతిరథ మహారధుల సమక్షం లో అంగరంగ వైభవంగా ఎంత ఘనంగా జరిపించారో ఇప్పటికి మనం మర్చిపోలేం..అలాంటి జంట విడిపోయింది అంటే వీళ్ళని అభిమానించే ప్రతి ఒక్కరికి బాధగానే ఉంటుంది..అయితే మనోజ్ తో విడిపోయిన తర్వాత ప్రణతి రెడ్డి ఎక్కడ ఉంది..ఏమి చేస్తుంది అనే విషయం చాలా మందికి తెలీదు..అయితే ప్రస్తుతం ఈమె అమెరికా లో ఒంటరిగా సోలో లైఫ్ ని లీడ్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..వృత్తి పరంగా ఆమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్..తనకి తెలిసిన పనిని చేసుకుంటూ ప్రశాంతం గా సోలో జీవితం ని ఎంజాయ్ చేస్తుందట.

.ఈమె భవిష్యత్తులో రెండవ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే విషయం ఎవరికీ తెలియదు కానీ..మంచు మనోజ్ మాత్రం అతి త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది..దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక తో మనోజ్ గత కొంత కాలం నుండి డేటింగ్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈమధ్య మనోజ్ ఎక్కడకి వెళ్లిన ఈమెతో కలిసే వెళ్తున్నాడు..గణేష్ ఉత్సవాలలో కూడా మౌనిక తో కనిపించాడు మనోజ్..అతి వీళ్ళ పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.