https://oktelugu.com/

Heroes : టిక్కెట్ రేట్ పెంచకపోవడం బెన్ ఫిట్ షో లు ప్రీమియర్ షో లు లేకపోవడం వల్ల ఇండస్ట్రీ లో ఏం జరగబోతుందో తెలుసా..?

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇక మీదట వచ్చే సినిమాలతో భారీ వసూళ్లను రాబడతారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 09:08 AM IST

    Heroes

    Follow us on

    Heroes : ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇక మీదట వచ్చే సినిమాలతో భారీ వసూళ్లను రాబడతారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలంగాణ ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. ఇక దానికి అనుగుణంగానే ఇండస్ట్రీ మొత్తం నడుచుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇక ఈ సందర్భంలో వాళ్లు చేసే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

    ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పైన కొంత కోపంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక శ్రీతేజ్ అనే కుర్రాడు మృత్యువు తో పోరాటం చేస్తూ ఐసియూ రో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే…మరి ఏది ఏమైనా కూడా అప్పటినుంచి బెనిఫిట్ షోస్, టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి గాని, ప్రీమియర్ షోలకి గాని ఎలాంటి అనుమతి లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశాడు. మరి మొత్తానికైతే దీనివల్ల ఇప్పుడు రాబోయే తెలుగు సినిమాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలోనే వాళ్లకు భారీ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రీవియర్ షో, బెనిఫిట్ షో లను రద్దు చేయడం సినిమా టికెట్ల రేట్లు పెంచకపోవడం లాంటివి చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ ఇదే ప్రాసెస్ కనక ఇక మీదట కూడా కొనసాగినట్లైతే సినిమా ఇండస్ట్రీలో భారీ మార్పులు వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్లను తగ్గించే అవకాశం ఉంది. అలాగే హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

    ఇవన్నీ చేస్తేనే ఒక సినిమా అనేది ప్రస్తుతం గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మాత్రం ప్రొడ్యూసర్ కి భారీ నష్టాలు మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా కూడా హీరోలకు రెమ్యూనరేషన్ రూపంలో, సినిమా బడ్జెట్ రూపంలో భారీ మొత్తంలో తగ్గించుకోవాలి.

    అలా అయితేనే ప్రొడ్యూసర్స్ కి లాభాలు ఎక్కువగా మిగిలుతాయి… లేకపోతే మాత్రం వాళ్లకు మిగిలేది శూన్యం అనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో టిక్కెట్ రేట్లు పెంచలేని క్రమంలో సినిమా హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ప్రభుత్వానికి ట్యాక్స్ ల రూపంలో చెల్లించే అమౌంట్ కూడా కొంతవరకు తగ్గుతుంది.

    ఇక ఏ రకంగా చూసుకున్న ఇటు హీరోలకి, సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇంకా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా కొన్ని మినహాయింపులతో బెనిఫిట్ షోలు, ప్రీవియస్ షోలు, టికెట్ రేట్లకు అవకాశం కల్పిస్తారా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…