Hero- Heroines: ఇటీవల సినిమాల్లో అశ్లీలం పెరిగిపోతోంది. బూతు మాటలతో పాటు బూతు సన్నివేశాలు ఉండటంతో కుటుంబంతో కలిసి సినిమాలు చూసే రోజులు పోయాయి. గతంలో సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం ప్రేమికులు మాత్రమే చూసే సినిమాలే వస్తున్నాయి. దర్శకులు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ సినిమా నిర్మాణానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని తెలిసిందే. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో దర్శకులు పడే శ్రమ మామూలుగా ఉండదని చెబుతుంటారు.
ప్రస్తుతం తీసే సినిమాల్లో ముద్దు సీన్లు లేకుండా ఉండటం లేదు. దీంతో వాటిని ప్రేక్షకులకు హృద్యంగా చూపించేందుకు దర్శకులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వాటిని చిత్రీకరించే సమయంలో దర్శకుల దిమ్మ తిరగాల్సిందే. ప్రేక్షకులను మెప్పించేలా సీన్ ఉండాలని తాపత్రయపడటం దర్శకుల వంతు. వాటిని చూస్తూ ప్రేక్షకులు లొట్టలు వేసుకోవడం మామూలే. వాటని తీసే క్రమంలో దర్శకులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. సీన్ పండాలంటే పరిపరి విధాలా చూపించేందుకు ఎన్నో తిప్పలు పడుతుంటారు.

ఇక సినిమాలో ముద్దు సీన్ కోసం హీరో హీరోయిన్లు పెదాలు అంటుకునేలా చూపించడం తెలిసిందే. కానీ నిజానికి వారి పెదాలు అతుక్కోకుండా మధ్యలో బెలూన్ ఉంచుతారట. అలా వారి పెదాలు కలిసినట్లుగా చూపించి ప్రేక్షకులను మైమరపింపచేయడం దర్శకుల ప్రతిభే. కానీ హాలీవుడ్ లో మాత్రం ముద్దు సీన్లు యథాతథంగానే తీస్తారట. దీంతో వారు ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. సీన్ పండటానికి పదేపదే ముద్దులు పెట్టుకునే క్రమంలో వారు పడే బాధలు వర్ణనాతీతమే. మన తెలుగు సినిమాల్లో మాత్రం దర్శకులు అలా చేయకుండా మధ్యలో ఏదైనా పెట్టి తీస్తారు.
ముద్దు సీన్లు తీసే ముందు హీరో హీరోయిన్లను ఒంటరిగా వదిలేస్తారు. వారు మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ముద్దు సీన్ తీసేటప్పుడు ఎలాంటి అభద్రతా భావం వారికి కలగకుండా ఉండేందుకే అలా చేస్తారు. ఇంకా ముద్దు సీన్లు తీసేటప్పుడు అందరిని బయటకు పంపించి ఒక దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే ఉంటారు. దీంతో వారికి ఎలాంటి భయం కలగకుండా ఉండేందుకు వాతావరణం అనువుగా ఉండేలా చూస్తారు. అందుకే ముద్దు సన్నివేశాలు అంత రసవత్తరంగా ఉండేలా దర్శకులు ప్లాన్ చేస్తారని తెలుస్తోంది.