Taraka Ratna Wife Alekhya Reddy: నందమూరి హీరో తారకరత్న ఈ లోకం విడిచి ఆరు నెలలు అవుతుంది. ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఆయన జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు. ప్రతిరోజూ తారకరత్నను ఆమె తలచుకుంటారు. నెలలు గడుస్తున్నా ఆమె మానసిక వేదన అనుభవిస్తున్నారని ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. అలేఖ్య రెడ్డి, తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. అది కూడా పెద్దల్ని ఎదిరించి. అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న హీరోగా తెరకెక్కిన నందీశ్వరుడు చిత్రానికి ఆమె పని చేశారు.
అలా వారి పరిచయం మొదలై ప్రేమకు దారి తీసింది. అలేఖ్య రెడ్డి అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకుని ఉన్నారు. దాంతో తారకరత్న ప్రేమను పేరెంట్స్ అంగీకరించలేదు. గుడిలో రహస్యంగా నిరాడంబరంగా తారకరత్న-అలేఖ్య రెడ్డి వివాహం జరిగింది. తారకరత్న కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగింది. దీంతో పేరెంట్స్ నిరాదరణకు గురైన తారకరత్న, అలేఖ్య ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అనేక బాధలు అనుభవించారు. మనోధైర్యంతో పోరాడి తమకంటూ ఒక జీవితం నిర్మించుకున్నారు.
ముగ్గురు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కాపురంపై దేవుడు చిన్నచూపు చూశాడు. అందమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. తారకరత్న ఉన్నప్పుడే అలేఖ్య రెడ్డిని అత్తమామలు పట్టించుకుంది లేదు. ఇప్పుడు తారకరత్నే లేడు. కాబట్టి అలేఖ్య పిల్లల బాధ్యత ఒంటిరిగా నెరవేరుస్తున్నారని సమాచారం. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అచ్చు తండ్రి పోలికే అంటూ కొడుకు ఫోటో ఇటీవల అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో పెట్టింది.
అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో తన వృత్తిని కొనసాగిస్తున్నారట. పిల్లల్లో తారకరత్నను చూసుకుంటూ ఆమె ముందుకు వెళుతున్నారట. నారా లోకేష్ 2023 జనవరిలో యువగళం పేరుతో పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ పాదయాత్రకు మద్దతుగా బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్ర మొదలైన కాసేపటికే తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించారు. సుదీర్ఘ పోరాటం చేసిన తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు.