Naga Chaitanya Shobhitha Dhulipalla : అక్కినేని వారింట్లో పెళ్లిసందడి నెలకొంది. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలో అడుగుపెట్టబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను నాగ చైతన్య కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. రెండేళ్లకు పైగా ఈ జంట రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 8వ తేదీన శోభితతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగింది ఈ వేడుకను చాలా నిరాడంబరంగా ముగించారు. కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మంచి ముహూర్తం కోల్పోకూడదు అనే హడావుడిగా ఎంగేజ్మెంట్ చేశామని నాగార్జున వివరణ ఇచ్చారు.
డిసెంబర్ 4న రాత్రి 8:13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య-శోభితల వివాహం జరగనుంది. పెళ్లి కూడా సింపుల్ గా ముగిస్తున్నారు. నాగ చైతన్య కోరిక మేరకు ఆర్భాటం లేకుండా.. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారట. శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఈ క్రమంలో వారి సాంప్రదాయం ప్రకారం వివాహం జరగనుందట. 8 గంటల పాటు సుదీర్ఘంగా పెళ్లి తంతు సాగుతుందని టాక్.
కాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నాగ చైతన్య కోసం నాగార్జున ఖరీదైన బహుమతి సిద్ధం చేశాడట. పెళ్ళికి కానుకగా అది ఇవ్వనున్నాడట. రూ. 2.5 కోట్ల విలువైన లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇస్తున్నాడట. అధునాత లెక్సస్ LM MPV కారును ఇప్పటికే కొనుగోలు చేసి నాగార్జున రిజిస్టర్ చేయించారట. నాగ చైతన్యకు కార్లు అంటే మహా ఇష్టం అట. అందుకే తనకు నచ్చిన లగ్జరీ కార్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాడనేది టాలీవుడ్ టాక్.
ఈ క్రమంలో మరి కోడలు శోభితకు ఏం బహుమతి ఇస్తున్నాడనే సందేహం రాకపోదు. కొడుక్కి ఇచ్చిన నాగార్జున కోడలికి ఇవ్వకుండా ఉంటాడా? ఆమెకు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నాడని తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. శోభితను కోడలిగా రావడం నాగార్జునను సంతోషానికి గురి చేసింది. ఆయన మాటలు, సోషల్ మీడియా పోస్ట్స్ ఈ విషయం తెలియజేస్తున్నాయి.
మరోవైపు నాగ చైతన్య-శోభిత పెళ్లి పై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించనుందట. నాగ చైతన్య పెళ్లి వీడియో హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ రూ. 50 కోట్లు చెల్లిస్తుందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నయనతార పెళ్లిని డాక్యుమెంటరీగా రూపొందించిన నెట్ఫ్లిక్స్ రూ. 25 కోట్లు చెల్లించారనే వాదన ఉంది.