Chiranjeevi: చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెడుతున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన మన శంకర వరప్రసాద్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఆయన సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు ఈ సినిమాతో రాబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాడు… ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో చిరంజీవి ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు. ఇప్పటికే 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నప్పటికి కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ మీద ఆయన ఏజ్ తెలిసిపోతుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయిన చిరంజీవి ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత హీరోగా అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆయన ఏజ్ అనేది ఎక్కువగా పెరిగిపోయి స్క్రీన్ మీద కనబడుతోంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన సినిమాలు చేయకపోతేనే బెటర్ అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు…
ఇక హీరోగా కాకుండా ఏమైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులు మెప్పిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక బాబీ , శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తి అవ్వాలంటే మరో రెండు, మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు సంవత్సరాల్లో అతను ఏజ్ ఇంకా పెరిగిపోతుంది.
తద్వారా ఆయన మరింత మారే అవకాశాలైతే ఉన్నాయి. ఆయన ఏం చేసిన స్క్రీన్ మీద మాత్రం ఏజ్ తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మరికొంతమంది చెబుతున్నారు. చూడాలి మరి చిరంజీవి ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు అనేది…