Bhartha Mahasayulaku Wignyapathi: రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈనెల 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తాడు అనే ఒక సంకల్పం తో ఉన్నాడు. ఇక ఈ సంక్రాంతి విన్నర్ తనే అవుతానని కూడా చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు… ఇద్దరమ్మాయిల మధ్యన నలిగిపోయే క్యారెక్టర్ లో రవితేజ నటించడం ఇదే మొదటి సారి… తన భార్యతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాగే తన లవర్ చూపించే ప్రేమకి ఎలా కట్టుబడి ఉంటాడు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఒక సినిమా చేయమని రవితేజకు ఎవరు చెప్పారు. ఇంతకుముందు మొత్తం మాస్ సినిమాలను చేస్తూ వచ్చిన రవితేజ ఒక్కసారిగా ట్రాక్ మార్చాడు.
ఇక ఫ్యామిలీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి సినిమా చేయడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…రవితేజ వైఫ్ ఎప్పుడు మాస్ సినిమాలను ఎందుకు చేస్తున్నావు… కొంచెం ఫామిలీ సినిమాలు కూడా చేయొచ్చు కదా అని చెప్పిందంట. దాంతో రవితేజ రూట్ మార్చినట్టుగా తెలుస్తోంది.
ఇక అప్పుడే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే కాన్సెప్ట్ తో కిశోర్ తిరుమల రావడంతో వెంటనే ఓకే చేసేసారట. గత సంవత్సరం మాస్ జాతర సినిమాతో బొక్క బోర్లా పడ్డ రవితేజ ఈ సంవత్సరం స్టార్టింగ్ లో భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.
మరి ఈ సినిమా సైతం మరోసారి సూపర్ సక్సెస్ ను అందిస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వరుసగా నాలుగైదు సినిమాలతో ఫ్లాపులను మూట కట్టుకున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…