Balakrishna: తెలుగు ప్రేక్షకులలో నందమూరి బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య యంగ్ దర్శకులతో సినిమాలు చేస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. తన పర్సనల్ లైఫ్ లో కూడా బాలయ్య కొన్ని నియమాలను పాటిస్తారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రకమైన అలవాట్లు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంక్రాంతికి వరుసగా బాలకృష్ణ నాలుగో హిట్టు కొట్టి పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెర మీద కూడా అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో తన సత్తా చాటుతున్నారు. అలాగే వరుసగా మూడోసారి బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం బాలయ్యకి మహర్దశ నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది. కెరియర్ పరంగా చూసుకుంటే బాలయ్య స్టైలే వేరు. యంగ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తూ విజయాలను తన సొంతం చేసుకుంటున్నారు. అయితే బాలయ్యకు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి అలవాట్లు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే. బాలకృష్ణ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా, ఎంత లేటుగా షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన ప్రతిరోజు ఉదయం మాత్రం 3.30 గంటలకు నిద్రలేస్తారు. ఇది బాలయ్యకు ఉన్న అలవాటు. నిద్రలేచిన వెంటనే బాలయ్య ముందుగా భూమాత కి నమస్కరించి పాదాలో నేలపై పెడతారట. ఇక ఆ తర్వాత స్నానం చేసి సూర్యోదయంలోపే పూజ చేసుకుంటారు.
బాలయ్య కి దైవభక్తి ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన భగవంతుడి కోసం సమయం కేటాయిస్తే మనకోసం మనం సమయం కేటాయించుకున్నట్లే అని నమ్ముతారు. అందుకే బాలయ్య ప్రతిరోజు సూర్యోదయానికి ముందే పూజకి సమయం కేటాయిస్తారు. ఈయనకు తెలుగు పద్యాలు మరియు సంస్కృతంలో మంచి పట్టు ఉంది. వీటి కోసం చిన్నతనంలో బాలయ్య తెలుగు మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిభ ఉన్న అతి కొద్ది మంది తెలుగు హీరోలలో బాలయ్య కూడా ఒకరు. ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ను తీసుకువచ్చి ఆయన స్టైల్ పూర్తిగా మార్చేసిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్.
ఇక తాను ఇప్పటివరకు ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించిన కూడా సమరసింహారెడ్డి చిత్రానికి మాత్రం తిరుగు లేదని, తన చిత్రాలలో తనకు చాలా ఇష్టమైన చిత్రం ఇదేనని బాలయ్య చెప్తుంటారు. ఆహారం విషయంలో ఈయనకు ఎలాంటి నియమాలు లేవు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా బాలయ్య సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది.