Homeఎంటర్టైన్మెంట్Vivek Athreya: 'భీమ్లానాయక్' సినిమాను మిస్ చేసుకున్న ఆ యువ దర్శకుడు ఎవరో తెలుసా..?

Vivek Athreya: ‘భీమ్లానాయక్’ సినిమాను మిస్ చేసుకున్న ఆ యువ దర్శకుడు ఎవరో తెలుసా..?

Vivek Athreya: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించాడు. ఆయన ఈ సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఆయన స్క్రీన్‌ప్లే రచించారు. అయితే ఆయనకు ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ముందుగా త్రివిక్రమ్ మైండ్‌లో వచ్చిన దర్శకుడు సాగర్.కె.చంద్ర కాదు.

Vivek-Athreya
Vivek-Athreya

ముందుగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను యువ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఇవ్వాలని త్రివిక్రమ్ భావించినట్లు తెలుస్తోంది. మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంట్‌తోనే నేచురల్ స్టార్ నానితో ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ గతంలో తెరకెక్కించిన సినిమాలు చూసి ఫిదా అయిపోయిన త్రివిక్రమ్ భీమ్లానాయక్ మూవీ బాధ్యతలను అతడికే అప్పగించాలనుకున్నాడు. అయితే అప్పటికే నాని సినిమాకు డేట్స్ కేటాయించడం వల్ల ఈ ఆఫర్‌ను వివేక్ ఆత్రేయ వదులుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో త్రివిక్రమ్ అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమా తీసిన సాగర్.కె.చంద్రను ఫైనలైజ్ చేశాడు.

Bheemla Nayak Box Office Collection
Pawan Kalyan and Rana

చివరకు త్రివిక్రమ్ పెట్టుకున్న నమ్మకాన్ని సాగర్ వమ్ము చేయలేదు. మలయాళం కంటే బెటర్‌గా తెలుగులో భీమ్లానాయక్ కథను డీల్ చేశాడు. పవన్, రానా మధ్య మంచి సన్నివేశాలు పడేలా చూసుకుని రంజుగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాను సాగర్ కె.చంద్ర అద్భుతంగా తెరకెక్కించాడంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా ప్రస్తుతం భీమ్లానాయక్ మూవీ ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్‌లు సాధిస్తూ దూసుకుపోతోంది.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Mucherla Aruna in Chiranjeevi movie: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు ?, కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి ఆమె, అందం, అభినయం కలబోసిన ఆ నటినే ‘ముచ్చెర్ల అరుణ’. ఆమె కన్నులు కలువ పూలులా ఉంటాయి. ఆ కలువ కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె మన తెలుగమ్మాయే. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular