Saif Ali Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల మీద తరచుగా దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ (Salman Khan) ని చంపుతానని లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన విషయం మనకు తెలిసిందే. ఇక అది మరువక ముందే ‘సైఫ్ అలీ ఖాన్’ (Saif Ali khan) మీద దాడి జరగడం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. మరి ఎందుకు బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసి నిందితులు వాళ్ళ మీద రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే లేదు. కానీ ‘సైఫ్ అలీ ఖాన్ ‘ మీద జరిగిన దాడి ప్లాన్ ప్రకారం జరిగిందా లేదంటే అనుకొని పరిస్థితుల వల్ల అలా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది…
బాలీవుడ్ స్టార్ హీరో అయినా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మీద గత రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఒక వ్యక్తి రాత్రి రెండు గంటల సమయంలో అతని మీద కత్తితో దాడి చేసి అతన్ని ఆరుసార్లు కత్తితో పొడిచిన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికి ఇప్పటివరకు అతనిని పట్టుకోలేకపోయిన పోలీసుల మీద ప్రజల్లో నెగెటివిటి అయితే పెరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ నిందితుడికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటన జరిగిన నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకు ఒక షాపులో ఆ నిందితుడు హెడ్ ఫోన్స్ కొన్నట్టుగా వీడియోలో రికార్డు అయింది. ఇక బ్లూ షర్ట్ వేసుకున్న ఆ వ్యక్తి ఫేస్ అయితే కనిపించడం లేదు. కానీ తన షర్టు ను ఆధారంగా చేసుకొని పోలీసులు అతడే నిందితుడని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఆ నిందితుడు బాంద్రా వెళ్లే రైలు ఎక్కి పరారైనట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పోలీసులు మధ్యప్రదేశ్ లో ఒక అనుమానితుడిని కస్టడి లోకి తీసుకొని విచరిస్తున్నట్టుగా తెలుస్తోంది…
మరి ఏది ఏమైనా కూడా ఈ నిందితుడు పోలీసులతో ఆడుకుంటున్నాడనే చెప్పాలి. మరి అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఇంకా ఎన్ని రోజుల సమయం తీసుకుంటారు అనే విషయం మీద ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అభిమానులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఒక వ్యక్తి సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి అతని మీద కత్తి దాడి చేసి ఏ క్లూ ను మిగిల్చకుండా వెళ్లిపోయాడు అంటే అతను సైఫ్ అలీ ఖాన్ ను చంపడానికే వచ్చాడా? లేదంటే రాబరీ కి వచ్చి అలా అతన్ని పొడిచేసి వెళ్లిపోయాడా? ఇంతకీ అతను ఎవరు అతన్ని ఎవరు పంపించారు అనే దాని మీదనే ఇప్పుడు పోలీసులు తీవ్రమైన విచారణలను కొనసాగిస్తున్నారు.
ఇక మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశమైతే ఉంది. మరి ఆలోపైన పోలీసులు ఆ నిందితుడిని పట్టుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…