Anchor Suma: టాలీవుడ్ లో నెంబర్ యాంకర్ ఎవరు అని అడిగితె టక్కుమని మనకి గుర్తుకు వచ్చే పేరు సుమ..బుల్లితెర మీద ఈమె సృష్టించిన ప్రబంజనం మామూలుది కాదు అనే చెప్పాలి..తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని మనసారా నవ్విస్తుంది సుమ..ఈమె షోస్ మంచి స్ట్రెస్ బస్టర్ లాగ ఉంటుంది..ఇక ఈమె లేనిదే టాలీవుడ్ లో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ ఎంతో అందం ని తెచ్చిపెడుతుంది.

చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె యాంకర్ గా కావాలి..పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆమెనే యాంకర్ గా కావాలి..ఆమెని యాంకర్ గా పెట్టుకోడానికి నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా వెనకాడరు..అంతే కాకుండా ఈమెకి సోషల్ మీడియా లో కూడా క్రేజ్ ఎక్కువే..తన ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే సుమ కి సంబంధించి ఏ చిన్న రూమర్ సోషల్ మీడియా లో వచ్చిన తెగ వైరల్ గా మారిపోతుంది.
Also Read: Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వాటికీ కూడా ఒప్పుకుంది.. కారణం అదే !
గతం లో కూడా సుమ తన భర్త రాజీవ్ కనకాల తో విడాకులు తీసుకోబోతుంది అంటూ ఒక్క వార్త తెగ ప్రచారమైన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని సుమ పలు ఇంటర్వూస్ లో తెలిపింది..ఇది పక్కన పెడితే సుమ చాలా కాలం నుండి ఒక్క వ్యాధితో తీవ్రమైన ఇబ్బంది పడుతుంది..ఈ వ్యాధి కి ఆమె తరుచు సస్త్ర చికిత్స చేసుకుంటూనే ఉంది..ఇంతకీ ఆమె ఉన్న వ్యాధి పేరు ఏమిటంటే కీలాయిడ్ టెండెన్సీ..ఇది చర్మ సంబంధిత వ్యాధి.

ఈ వ్యాధి ఉన్నవారికి శరీరం మీద ఏదైనా గాయం అయితే , ఆ గాయం మానకపోగా పెరుగుతూ పోతుంది..మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుందని..చాలా ఏళ్ళ నుండి ఈ సమస్య నన్ను చాలా బాధకి గురి చేస్తుందని సుమ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు..వాస్తవానికి ఈ వ్యాధి మేకప్ వల్లే వచ్చిందని..కెరీర్ ప్రారంభం అసలు ఎలా మేకప్ వేసుకోవాలి..ఎలా తీసేయాలి అనేది తెలిసేది కాదని..అందువల్లే ఈ సమస్య తలెత్తింది అని చెప్పుకొచ్చింది సుమ..ఇది ఇలా ఉండగా సుమ తొలిసారి ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ అనే సినిమా ఇటీవలే విడుదలై ఆశించిన స్థాయి ఫలితాన్ని దక్కించుకోలేకపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.
Also Read:Rashmika Mandanna: రష్మిక మందన్నా రెడ్ అందాలు.. ఈ పిక్స్ ముందు ఏంజెల్ కూడా తక్కువే
[…] Also Read: Anchor Suma: విచిత్రమైన వ్యాధికి అత్యవసర చిక… […]