Game Changer: ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఓకేత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా ముందుకు సాగనున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్స్ చేంజర్ సినిమా మీద ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం రామ్ చరణ్ క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోతుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలు ఇప్పటివరకు మంచి విజయాన్ని అయితే సాధిస్తూ వచ్చాయి. ఇకమీదట కూడా భారీ విజయాన్ని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా తనకున్న బిరుదును కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయనకు ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే శంకర్ ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు స్ట్రైయిట్ తెలుగు సినిమా ఒక్కటి కూడా చేయలేదు. ఇక దాంతో గేమ్ చేంజర్ సినిమానే తను చేస్తున్న మొదటి తెలుగు సినిమాగా మార నుంది. కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలని ఆయన కూడా తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
మరి ఈ ట్రైలర్ కూడా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద హైప్ ని పెంచుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇందులో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు నటించబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్లు ఎవరు అంటే ఒకరు రాజమౌళి కాగా మరొకరు సంచలన డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక వీళ్ళిద్దరూ రెండు వేరు వేరు సీన్లలో కనిపిస్తారట…ఇక వీళ్ళ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కూడా సినిమా మీద హైప్ ని కంటిన్యూ చేయడానికి వీళ్ళిద్దరితో స్పెషల్ పాత్రలను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఎక్కడ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కారణం ఏంటి అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులు త్రిల్ ఫీల్ అవ్వడానికే వాళ్ల చేత ఆ క్యారెక్టర్స్ ని చేయిస్తున్నారు.
కాబట్టి ముందే చెబితే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడికి అంత ఇంపాక్ట్ అనిపించదనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించాలని చూస్తున్న శంకర్ భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…