https://oktelugu.com/

Dil Raju: శంకర్ రెమ్యునరేషన్ లో కోత విధించిన దిల్ రాజు…కారణం ఏంటి..? ఇంతకీ ఆయనకి ఎంత ఇచ్చారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక వీళ్లతో పాటు దర్శకులు కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడం లో సక్సెస్ అయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గత 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏలుతున్న ఒకే ఒక దర్శకుడు శంకర్...

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2025 / 01:17 PM IST

    Dil Raju(2)

    Follow us on

    Dil Raju: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్…ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటి పాన్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడంతో ఇండియాలో ఆయనకు సపరేటు గుర్తింపైతే వచ్చింది. అయితే గత పది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. కాబట్టి కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. మరి ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించక పోయినా కూడా ఆయన క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదు. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు 500 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన కోసం శంకర్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే మొదట్లో దిల్ రాజు కూడా ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపించారట.

    కానీ ఆ తర్వాత సినిమా లేట్ అవుతున్న కొద్ది ఆయన రెమ్యూనరేషన్ లో కోత విధించినట్టుగా తెలుస్తోంది. దానికి శంకరు కూడా అంగీకరించాడట. మొత్తానికైతే ఈయనకు 100 కోట రెమ్యూనరేషన్ ఇస్తానని ఒప్పుకున్న దిల్ రాజు కేవలం 65 కోట్లు మాత్రమే ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలైతే జరుగుతున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా శంకర్ కూడా సినిమా బిజినెస్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత ‘భారతీయుడు 2’ సినిమా చేయాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిపోయేది. ఇక ఆయన వల్లే లేట్ అయింది. కాబట్టి తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే నే అటు రామ్ చరణ్, ఇటు దిల్ రాజు, శంకర్ ముగ్గురు కూడా పాన్ ఇండియాలో స్టార్లుగా మరోసారి గుర్తింపబడతారు.

    లేకపోతే మాత్రం సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాతో శంకర్ తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా లేదంటే ‘భారతీయుడు 2’ బాటలోనే ఈ సినిమా కూడా మరోసారి డీలా పడుతుందా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…