https://oktelugu.com/

2021లో టాప్ టీఆర్పీ మూవీలేంటో తెలుసా?

గత ఏడాదిగా సినిమా ఇండస్ట్రీని కరోనా కాటేసింది. సినిమాలు విడుదల చేయడానికి కూడా నిర్మాతలు సాహసించని పరిస్థితి నెలకొంది. కరోనా మొదటి, సెకండ్ వేవ్ లంటూ గ్యాప్ లిస్తూ విరుచుకుపడడంతో సినిమాలు ఆచితూచి విడుదల చేశారు. ఈ క్రమంలోనే సినిమాలు థియేటర్లో రిలీజ్ కావడంతోపాటు వెంటనే నెలకే టీవీ తెరపై వస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ తోపాటు శాటిలైట్ రైట్స్ ను అమ్మేస్తుండడంతో సినిమా థియేటర్ల నుంచి వెళ్లిన రెండు వారాలకే బుల్లితెరపై వేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2021 / 07:36 PM IST
    Follow us on

    గత ఏడాదిగా సినిమా ఇండస్ట్రీని కరోనా కాటేసింది. సినిమాలు విడుదల చేయడానికి కూడా నిర్మాతలు సాహసించని పరిస్థితి నెలకొంది. కరోనా మొదటి, సెకండ్ వేవ్ లంటూ గ్యాప్ లిస్తూ విరుచుకుపడడంతో సినిమాలు ఆచితూచి విడుదల చేశారు.

    ఈ క్రమంలోనే సినిమాలు థియేటర్లో రిలీజ్ కావడంతోపాటు వెంటనే నెలకే టీవీ తెరపై వస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ తోపాటు శాటిలైట్ రైట్స్ ను అమ్మేస్తుండడంతో సినిమా థియేటర్ల నుంచి వెళ్లిన రెండు వారాలకే బుల్లితెరపై వేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.

    ఇప్పుడు ఏ సినిమా అయినా సరే విడుదలైన నెలకే టీవీల్లో వచ్చేస్తోంది. దాంతో టీవీల టీఆర్పీ రేటింగులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటివరకు 2021లో వచ్చిన సినిమాల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ వచ్చిన చిత్రం ఏంటో తెలుసా? ఇంకెవరు బుల్లితెర పవర్ స్టార్ మేనియాతో ఊగిపోయింది.

    జీతెలుగులో ప్రసారమైన వకీల్ సాబ్ మూవీకి అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఈ సంవత్సరంలో దక్కింది. 2021లో టీవీల్లో వచ్చిన అన్ని చిత్రాల కంటే కూడా ‘వకీల్ సాబ్’ మూవీకి ఏకంగా 19.12 రేటింగ్ తో పవర్ స్టార్ పవర్ ఏంటో బుల్లితెరపై చూపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బుల్లితెరపై కూడా అంతే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది.

    ఇక ‘వకీల్ సాబ్’ తర్వాత అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన మూవీ ‘ఉప్పెన’ ఈ డిఫెరెంట్ ప్రేమ కథా చిత్రం బుల్లితెరపై ఏకంగా 18.51 రేటింగ్ లో టాప్ 2లో నిలచింది.

    ఇక మూడో స్థానంలో రవితేజ క్రాక్ 11.71 రేటింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత 4వ స్తానంలో నితిన్ ‘చెక్’ మూవీ 8.53 రేటింగ్ సొంతం చేసుకుంది. 5వ ప్లేసులో 8.1 రేటింగుతో జాంబిరెడ్డి ప్రేక్షకాదరణ పొందింది.