Tollywood Heroes: హీరోలకు బిరుదులు ఉండడం కామన్. ఇండస్ట్రీ కొత్తలో కొన్ని బిరుదులు ఉంటే స్టార్లుగా అవతారం ఎత్తిన కొద్ది మరిన్ని కొత్త కొత్త బిరుదులు వచ్చి చేరుతుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో డిఫెరెంట్ బిరుదు సినిమాను బట్టి వస్తుంటుంది. అందులో వారి నటనను బట్టి ప్రేక్షకులు బిరుదులను ఇస్తుంటారు. ఇప్పుడు బాలయ్యను కూడా మరో బిరుదుతో పిలుస్తున్నారు. బాలయ్యకు వచ్చిన ఈ కొత్త బిరుదు సందర్బంగా ఇతర హీరోల కొత్త బిరుదులు కూడా తెలుసుకుందాం…
బాలకృష్ణ: ముందుగా బాలయ్య కు వచ్చిన బిరుదు గురించి తెలుసుకుంటే తన తండ్రికి రామారావుకు ఉన్న నటరత్న బిరుదును అభిమానులు యువరత్నగా పిలవడం ప్రారంభించారు. తండ్రిని నట రత్న అనిపిస్తే.. సింహా సినిమా తర్వాత బాలయ్యను నట సింహం అని పిలుచుకున్నారు. ఇప్పుడు ఏకంగా భగవంత్ కేసరి సినిమాతో సినిమాతో గ్లోబల్ లయన్ అనే బిరుదును చేర్చారు. ఇక బాలయ్య కెరీర్‌లో యువరత్న, నటసింహా కాకుండా.. గోల్డ్ స్టార్, యుగాస్టార్,నటరత్న వంటి బిరుదులు పలు సినిమాల్లో కనిపించాయి. మరి బాలయ్యకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అలాంటిది మరీ..
మహేష్ బాబు : మహేష్ బాబు ఫస్ట్ మూవీ ‘రాజకుమారుడు’ సినిమా నుంచి ప్రిన్స్ అని పిలవడం మొదలు పెట్టారు అభిమానులు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా సక్సెస్‌తో పండుగాడుగా ఉన్న మహేష్ కు.. తన తండ్రికి మాత్రమే ఉన్న సూపర్ స్టార్ బిరుదును చేర్చుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు అయ్యాడు.
ప్రభాస్: ప్రభాస్‌కు పెదనాన్నఅయినా దివంగత నటుడు కృష్ణంరాజు రెబల్ స్టార్ బిరుదును ప్రభాస్ కి ఇస్తూ..యంగ్ రెబల్ స్టార్ ను చేశారు అభిమానులు . అటు డార్లింగ్ అంటూ కూడా కొంత మంది అభిమానులు పిలుస్తుంటారు. ఇప్పుడు వయసు పెరుగుతుంది కాబట్టి యంగ్ రెబల్ స్టార్ కాస్త రెబల్ స్టార్ కు వచ్చేసింది. అంతేకాదు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతారమెత్తారు ప్రభాస్.
చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి అని అందరూ పిలుస్తుంటే ఇంటి పేరు అనుకుంటారు కూడా నెటిజన్లు. కానీ అది తన బిరుదు అని చాలా తక్కువ మందికే తెలుసు. అయితే కొన్ని విజయాల తర్వాత సుప్రీమ్ హీరో నుంచి ఈ మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. ఇదిలా ఉంటే మరణ మృదంగం సినిమా తర్వాత చిరుకు చిరంజీవి అనే పేరు వచ్చింది. ఈయన అసలు పేరు శివ శంకర వర ప్రసాద్. కానీ ఈ సినిమా ద్వారా చిరంజీవి అయ్యారు. ఇలా సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు కూడా.
నాగార్జున:తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు నట సామ్రాట్ అనే బిరుదు ఉండేది. అది కాస్త నాగార్జున వరకు వచ్చే సరికి యువ సామ్రాట్ గా మారిపోయింది. కింగ్ సినిమా చేశాక ఈ బిరుదు తో పాటు కింగ్ అని పిలుచుకున్నారు అభిమానులు. ఇప్పుడు చాలా మంది నట సామ్రాట్ అని నాగచైతన్యను కూడా పిలుస్తుంటారు.
అల్లు అర్జున్ : స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్ గా ఎదిగాడు బన్నీ. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి స్టైలిష్ స్టార్ గా ఉండి పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అంతే కాదు ఐకాన్ అనే టైటిల్ తో త్వరలో ఓ సినిమా కూడా రాబోతుంది. ఇందులో హీరో కూడా మన ఐకాన్ స్టార్ బన్నీనే.. పుష్ప 2 సినిమా తర్వాత ఈ సినిమాను శ్రీ రామ్ వేణు డైరెక్ట్ చేస్తారు అనే టాక్ నడుస్తోంది.
రామ్ చరణ్: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ గ్లోబల్ స్టార్ అయ్యాడు. దీంతో మెగా పవర్ స్టార్ కాస్తా గ్లోబర్ స్టార్‌గా బిరుదును సంపాదించారు. దీంతో ఇప్పుడు చెర్రీని రామ్ చరణ్ అనేకంటే గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు కూడా.