https://oktelugu.com/

Hrithik Roshan in KGF 3: షాకింగ్..KGF 3 లో హృతిక్ రోషన్..ఏ రోల్ తెలుసా??

Hrithik Roshan in KGF 3: బాహుబలి సిరీస్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఫ్రాంచైజ్ KGF సిరీస్..ఇటీవలే విడుదల అయినా KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన కలెక్షన్ల సునామి ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ #RRR కలెక్షన్స్ కి కూడా దాటేసి ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా అందుకుంది..సినిమా క్లైమాక్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 30, 2022 / 05:40 PM IST

    Hrithik Roshan in KGF 3

    Follow us on

    Hrithik Roshan in KGF 3: బాహుబలి సిరీస్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఫ్రాంచైజ్ KGF సిరీస్..ఇటీవలే విడుదల అయినా KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన కలెక్షన్ల సునామి ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ #RRR కలెక్షన్స్ కి కూడా దాటేసి ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా అందుకుంది..సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోయినట్టు చూపించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఆ తర్వాత వెంటనే క్లైమాక్స్ లో KGF చాప్టర్ 3 కూడా ఉంది అంటూ హింట్ ఇస్తూ ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తాడు..అయితే నిజంగా KGF చాప్టర్ 3 ఉంటుందా లేదా అనే సందేహాలు ప్రేక్షకుల్లో నెలకొన్న నేపథ్యం లో ఆ చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ KGF చాప్టర్ 3 కచ్చితంగా ఉంటుంది అనే క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు పండగ చేసుకున్నారు..అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక్క వార్త దీనికి సంబంధించి ప్రచారం అవుతూనే ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.

    Hrithik Roshan, Yash

    Also Read: Ram charan Shankar Title: రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల్ అది కాదు అట

    ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న వార్త ఏమిటి అంటే ఈ సినిమా లో హృతిక్ రోషన్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అని,ఇందులో కథని మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన నటిస్తున్నాడు అని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి..అయితే ఇదే విషయం ని ఆ చిత్ర నిర్మాత విజయ్ కరంగాదూర్ అని అడగగా ఆయన దానికి సమాధానం ఇస్తూ ‘ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి ద్రుష్టి మొత్తం ప్రభాస్ సలార్ మీద మాత్రమే ఉంది, ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే KGF చాప్టర్ 3 గురించి ఆలోచిస్తాడు..నటీనటుల వివరాలు కూడా అప్పుడే తెలియచేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ చిత్ర నిర్మాత..కానీ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఉన్నదా లేదా అనే ప్రశ్నకి మాత్రం మాట జారవేసాడు..ఆయన ఈ సినిమాలో ఉన్నాడు అని చెప్పలేదు..ఆలా అని లేదు అని కూడా చెప్పలేదు..దీనిని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ ని ఒక్క పాత్ర కోసం ఆ చిత్ర దర్శక నిర్మాతలు నిజంగానే సంప్రదించినట్టు అర్థం అవుతుంది సోషల్ మీడియా లో అభిమానుల నుండి వినిపిస్తున్న వార్త..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

    Hrithik Roshan

    Also Read: Allu Arjun Shock To Fans: అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్

    Recommended Videos:


    Tags