https://oktelugu.com/

Anasuya Bharadwaj: కొల్లగొట్టినాదిరో’ పాటలో కనిపించినందుకు అనసూయ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇంతనా? హీరోయిన్లు కూడా ఈ స్థాయిలో తీసుకోరుగా!

'కొల్లగొట్టినాదిరో'(Kollagottinaadiro Full Song) లిరికల్ వీడియో ని విడుదల చేసారు. ఈ పాటకు మాత్రం ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: , Updated On : February 25, 2025 / 09:02 AM IST
Anasuya Bharadwaj (1)

Anasuya Bharadwaj (1)

Follow us on

Anasuya Bharadwaj: టాలీవుడ్ పోలవరం ప్రాజెక్ట్ గా పిలవబడే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం, ఎట్టకేలకు ఎన్నో కష్టాలను ఎదురుకొని వచ్చే నెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో విడుదల అని చెప్తున్నారు కానీ, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇంకా నాలుగు రోజుల షూటింగ్, అదే విధంగా ఒక పాట చిత్రీకరణ కూడా బ్యాలన్స్ ఉందట. రీసెంట్ గానే రాజస్థాన్ కి వెళ్లి పలు కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ని జరుపుకొని వచ్చారు. ఇవి పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలట. ఇక మిగిలిన షూటింగ్ పూర్తి అయ్యి, VFX వర్క్ కూడా పూర్తి అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 28 న వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువే.

కానీ ప్రొమోషన్స్ మాత్రం వచ్చే నెల విడుదల అన్నట్టుగానే చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రం లోని మొదటి పాట ‘మాట వినాలి’ ని విడుదల చేసారు , రెస్పాన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది. నిన్న ఈ సినిమా నుండి ‘కొల్లగొట్టినాదిరో'(Kollagottinaadiro Full Song) లిరికల్ వీడియో ని విడుదల చేసారు. ఈ పాటకు మాత్రం ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న మధ్యాహ్నం విడుదలైన ఈ పాటకు ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది కాసేపు పక్కన పెడితే ఈ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) తో పాటు యాంకర్ అనసూయ, యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడా కనిపించారు. యాంకర్ అనసూయ(Anchor Anasuya) లుక్ ని చూస్తుంటే , ఆమె యంగ్ వయస్సు లో ఉన్నప్పుడు ఈ పాటని షూట్ చేసినట్టుగా అనిపించింది. అంటే 2020 పీరియడ్ లో అన్నమాట.

రెండు రోజుల పాటు ఈ పాట కోసం అనసూయ పని చేసిందట. ఆ రెండు రోజులకు గాను ఆమె 50 లక్షల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. ఇది చిన్న మొత్తం డబ్బులు కాదు. ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల ‘కిస్సిక్’ సాంగ్ కోసం నాలుగు రోజులు పని చేస్తే ఆమె రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంది. అనసూయ ఆమె స్థాయి హీరోయిన్ కాదు. ఒక పక్క యాంకర్ గా చేస్తూ మరోపక్క క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగే వ్యక్తి ఆమె. అలాంటి ఆమెకు ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇచ్చారంటే, నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం డబ్బులు ఏ రేంజ్ లో ఖర్చు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి ఆయన పని తీరు ఇలాగే ఉంటుంది. చాలా కాలం గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీ లోకి ఈ సినిమా ద్వారా గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 

Kollagottinadhiro -Lyrical|Hari Hara Veera Mallu|PSPK|Nidhhi|MM Keeravaani |AM Rathnam|Jyothi Krisna