https://oktelugu.com/

Allu Arjun: జొమాటో యాడ్ కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పుష్ప పార్ట్ 1 హిట్ అవడంతో రెండవ పార్ట్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టే సినిమాగా పార్ట్ 2 నిలవబోతుందని ట్రేడ్ భారీ అంచనాలు పెట్టుకుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 15, 2023 / 01:22 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్ అంటే ఓ బ్రాండ్, బన్నీ అంటే ఓ క్రేజ్, ఈయనకు ఉండే ఫ్యాన్ బేసే వేరనుకోవాలి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫుల్ క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈయన హీరో ఏంటి అని విమర్శించారు. కానీ ఈయన లేనిదే ఇండస్ట్రీ లేదు అనే రేంజ్ కు ఎదిగాడు బన్నీ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఐకాన్ స్టార్ గా నిలిచాడు. ఈయన వ్యాపారాలు, సినిమాలు, యాడ్ ల ద్వారా ఫుల్ గా సంపాదించేస్తున్నారు. మరి జొమాటోలో మీరు ఆర్డర్ చేసుకొని ఉంటారు. ఈ బ్రాండ్ అల్లు అర్జున్ వల్ల ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లిందనడంలో సందేహం లేదు. మరి ఈ యాడ్ కోసం బన్నీ ఎంత తీసుకున్నారో తెలుసా?

    ఇతర రాష్ట్రాల్లో కూడా ఓ బ్రాండ్ లాగా మారాడు బన్నీ. ఈయన సినిమాల కోసం టాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న సినీ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ స్థాయిలో బన్నీ రేంజ్ ను పెంచిన సినిమా పుష్ప అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎలాంటి పాత్రకైనా నేను సూట్ అవుతాను అని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో నటించినందుకు రీసెంట్ గా నేషనల్ లెవల్ లో అవార్డు అందుకున్నారు పుష్ప స్టార్ బన్నీ.

    పుష్ప పార్ట్ 1 హిట్ అవడంతో రెండవ పార్ట్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టే సినిమాగా పార్ట్ 2 నిలవబోతుందని ట్రేడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలంటే ఆగష్టు 15 వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే అప్పట్లో జొమాటో యాడ్ చేశారు బన్నీ. ఈ యాడ్ కోసం ఏకంగా రూ. 35 లక్షల ను అందుకునేవాడట. గతంలో స్టార్ హీరోలందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ కు ఓ పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఒక యాడ్ చేయడం కోసం ఏకంగా ఎవరు ఛార్జ్ చేయని విధంగా అందుకుంటున్నారట.

    ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో దేశంలోనే టాప్ 2 స్థానంలో ఉంది జొమాటో. ఏది తినాలి అనిపించినా వెంటనే ఇందులో ఆర్డర్ చేస్తారు. బుక్ చేసిన క్షణాల్లో ఇంటి ముందుకు వచ్చి వాలిపోతారు. ఇక ఈ జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు బన్నీ. ఈ సంస్థ కోసం ఒక్కో యాడ్ కు రూ.6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. అయినా ఒకప్పుడు రూ. 35లక్షలు తీసుకున్నారు. ఆ మొత్తానికి ఈ మొత్తానికి పోల్చి చూస్తే బన్నీ రేంజ్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.