https://oktelugu.com/

Mahesh Babu & Rajamouli : మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకు రాజమౌళి ఫ్యామిలీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 / 10:44 AM IST

    Do you know the remuneration Rajamouli family is getting for the movie with Mahesh Babu..?

    Follow us on

    Mahesh Babu & Rajamouli : ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాని కూడా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా ‘జేమ్స్ కామెరూన్’, ‘స్టీవెన్ స్పీల్ బర్గ్’ లాంటి గొప్ప దర్శకుల సరసన నిలబడడానికి రాజమౌళి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందుకోసమే ఆయన చేయబోయే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే రాజమౌళి ఈ సినిమా విషయంలో మాత్రం అంతకు మించిన కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు రెండు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్న రాజమౌళి ఇక ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ సినిమా కోసం డిఫరెంట్ లొకేషన్స్ ని వాడుకుంటున్న రాజమౌళి ఈ సినిమాతో కచ్చితంగా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు. అయితే ఈ సినిమా దాదాపు 400 నుంచి 500 రోజులు వర్కింగ్ డేస్ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు ఈ సినిమా సెట్స్ మీదనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటిదాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అయ్యేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసేలా రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దాలని చూస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ప్రతి సినిమాకి తన ఎంటైర్ ఫ్యామిలీ వర్క్ చేస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. వాళ్ళ అన్నయ్య కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా, రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ కథ రచయితగా వాళ్ళ, పెదనాన్న అయిన శివశక్తి దత్త లిరిక్ రైటర్ గా, కీరవాణి భార్య వల్లి లైన్ ప్రొడ్యూసర్ గా, రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా, కీరవాణి తమ్ముడు కాంచి కథ సహాయకుడిగా ఇక రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు.

    ఇలా ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు. కాబట్టి ఈ ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో రాజమౌళి ఒక్కడే 150 కోట్ల రెమ్యూనరేషన్ ఉంటున్నారట.

    ఇక మిగతా వాళ్ళందరు కలిసి 150 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ బడ్జెట్ లో కేవలం రాజమౌళి ఫ్యామిలీ 25% రెమ్యూనరేషన్ రూపం లో తీసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…