Heroine Meena Remuneration: బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మీనా , ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు , తమిళం , కన్నడ మరియు మలయాళం అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో సౌత్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరితోనూ ఆమె నటించింది.
అందం తో పాటుగా అద్భుతమైన అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక కెరీర్ పీక్ స్టేజీ లో ఉన్న సమయం లోనే విడిసాగర్ అనే అతనిని పెళ్లాడింది మీనా.ఆయన గత ఏడాది ఊపిరి తిత్తుల సమస్యతో చనిపోయిన సంగతి తెలిసిందే.అయితే మీనా ఈ బాధ నుండి వెంటనే కోలుకొని వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా కాలాన్ని గడిపేస్తుంది.
తనకి ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి లేకపోయినా, కూతురు భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితిలో చెయ్యాల్సి వస్తుందని,ఈమధ్యనే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉండగా మీనా ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసినట్టు టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం ఆమె చేస్తున్నది క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ అయ్యినప్పటికీ కూడా కొంతమంది కుర్ర హీరోయిన్స్ కూడా తీసుకొని రెమ్యూనరేషన్ ని ఆయన అందుకుంటున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఆమె తమిళం లో ఎక్కువగా సినిమాలు చేస్తుంది.ఒక్కో సినిమాకి గాను ఆమె 20 నుండి 30 లక్షల రూపాయిలు పారితోషికం డిమాండ్ చేస్తుందట.
పని దినాలు పెరిగితే మరింత ఎక్కువ కూడా డిమాండ్ చేస్తుందట, అయితే కొన్ని పాత్రలు ఆమె మాత్రమే చెయ్యగలదు కాబట్టి నిర్మాతలు కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారట.ఇక ఈమె కూతురు నైనికా విజయ్ హీరో గా నటించిన ‘తేరి’ సినిమాలో బాలనటిగా నటించి పెద్ద మార్కులు కొట్టేసింది.పెద్దయ్యాక ఈమె కూడా ఆమె అమ్మలాగానే స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.