Sreeleela: మన టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ కాస్త మంచి పేరు రాగానే బాలీవుడ్ కి వెళ్ళిపోయి చేతులు కాల్చుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది అవుతుంది. బాలీవుడ్ లోకి వెళ్లి, అక్కడ సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోక ఫ్లాప్స్ ని అందుకుంటూ అటు బాలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోనూ అవకాశాలు కోల్పోయి కెరీర్ ని ముగించేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Actress Srileela) కూడా అదే బాటలోకి వెళ్లనుందా?.. తెలుగులో కాస్త క్రేజ్ రాగానే బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడంతో, తెలుగు లో ఒప్పుకున్న సినిమాలను కూడా వదులుకొని బాలీవుడ్ కి వెళ్ళింది. ప్రముఖ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali khan) హీరో గా నటిస్తున్న మొదటి సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.
ఈ సినిమాతో పాటు ప్రముఖ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Krathik Aryan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆషీకీ 3’ లో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆమె హీరోతో ముద్దు సన్నివేశాల్లో నటించడాన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తారా అని అడిగితే, లేదండి నా మొదటి లిప్ లాక్ నా భర్తకే సొంతం అంటూ ఇంటర్వ్యూస్ లో చెప్పుకొని తిరిగిన శ్రీలీల,, బాలీవుడ్ కి వెళ్ళగానే మారిపోయిందా అని ఆమె అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. అంతే కాదు, ఈ సినిమాకి ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ అట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2’ లో ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ చేసినందుకు రెండు కోట్ల రూపాయిలకే పైగా రెమ్యూనరేషన్ తీసుకుంది శ్రీలీల.
అలాంటి శ్రీలీల తన మొదటి బాలీవుడ్ సినిమా కోసం కేవలం కోటి 75 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకుంటుందట. తెలుగు లో శ్రీలీల డేట్స్ ఇస్తే నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని కళ్ళకు అద్దుకొని మరీ ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీ ని కాదని బాలీవుడ్ కి వెళ్లడం అవసరమా..?, అంత కష్టమేమి వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాల కోసం ఆమె విజయ్ దేవరకొండ తో చేయబోయే ఒక సినిమాని, అదే విధంగా నవీన్ పోలిశెట్టి తో చేయబోయే మరో సినిమాని కూడా వదులుకుందట. ఇలా ఏ హీరోయిన్ అయినా చేస్తారా..? , పూజ హెగ్డే అయినా కనీసం ఆమె సౌత్ లో స్థిరపడిన తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది. కానీ శ్రీలీల ఇంకా స్థిరపడలేదు. ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలు తప్ప ఈమె కెరీర్ లో క్లీన్ హిట్ ఒక్కటి కూడా లేదు. అలాంటి ఆమె ఏకంగా బాలీవుడ్ కి వెళ్లి చాలా పెద్ద పొరపాటు చేసిందని అంటున్నారు విశ్లేషకులు.