Devara Collection: ‘దేవర’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇదే ట్రెండ్ కొనసాగితే బ్రేక్ ఈవెన్ అసాధ్యం!

రేపు గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే ఉన్నందున ఈ చిత్రానికి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని, కచ్చితంగా రెండవ రోజు తో సమానంగా ఈ చిత్రం ఆ రోజు వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.

Written By: Vicky, Updated On : October 1, 2024 1:42 pm

Devara Collection(3)

Follow us on

Devara Collection: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ టాక్ ని తెచ్చుకొని మంచి ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకి వీకెండ్ ఓపెనింగ్ వసూళ్లు రావడం సర్వసాధారణం, కానీ మామూలు పని దినాలలో కూడా ఇదే స్థాయి వసూళ్లను సాధిస్తుందా లేదా, ఒకవేళ కలెక్షన్స్ స్టడీ గా ఉంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది, ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ ఈ సినిమా మొదటి సోమవారం నాడు చాలా డల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది. నాలుగు రోజులకు గాను ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాము. నాల్గవ రోజు ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, నాలుగు రోజులకు కలిపి 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

అయితే అన్ని ప్రాంతాల్లో సీడెడ్ లో కాస్త మెరుగైన వసూళ్లు రావడం గమనార్హం. నాల్గవ రోజు ఈ చిత్రానికి సీడెడ్ లో దాదాపుగా కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అలాగే ఉత్తరాంధ్ర లో 45 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 17 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 32 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 23 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం నాల్గవ రోజు 3.96 కోట్ల రూపాయిలు జీఎస్టీ తో కలిపి రాబట్టినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రం 134 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట.

రేపు గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే ఉన్నందున ఈ చిత్రానికి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని, కచ్చితంగా రెండవ రోజు తో సమానంగా ఈ చిత్రం ఆ రోజు వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు 180 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అది దాదాపుగా అసాధ్యం అని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ సినిమా 160 కోట్ల రూపాయిల షేర్ వద్ద థియేట్రికల్ రన్ ని ముగించుకుంటుందని, కనీసం 20 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. హిందీ వసూళ్లు మాత్రం ఇలాగే స్టడీ గా ఉన్నట్లు అయితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.