Superstar Krishna: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలు అయ్యే ప్రాసెస్ లో కొన్ని సినిమాలను ఇష్టపడి చేస్తే, మరికొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇక ఆ క్రమంలోనే కొన్ని సినిమాల వల్ల నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తే, మరికొన్ని సినిమాలు మాత్రం సూపర్ స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చి పెడతాయి. ఇక వీటిలో మనం ఏ సినిమా చేస్తే మన కెరియర్ కు హెల్ప్ అవుతుంది.
అని జడ్జిమెంట్ చేసే కెపాసిటి హీరోల దగ్గర ఉండాలి. లేకపోతే మాత్రం వాళ్ల కెరియర్ అనేది డైలామా లో పడిపోతుంది..ఇక ఇదిలా ఉంటే 1993 వ సంవత్సరంలో సుమన్ హీరోగా కృష్ణంరాజు స్పెషల్ పాత్రను పోషించిన సినిమా బావ బామ్మర్ది… ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన శరత్ కృష్ణం రాజు చేసిన పాత్ర కోసం మొదట సూపర్ స్టార్ కృష్ణని చేయమని అడిగాడట. కానీ కృష్ణ అప్పటికి హీరోగా కొనసాగుతూ ఉండటం వల్ల, ఇలాంటి పాత్ర తను చేయడం వల్ల హీరోగా తన ఇమేజ్ దెబ్బతింటుందని,
అలాగే ఆ పాత్రలో తనని చూసిన ఆయన అభిమానులు రిసీవ్ చేసుకోలేరని ఆ పాత్రను రిజెక్ట్ చేశారట. ఇక దాంతో ఆ పాత్రని కృష్ణంరాజు చేసి తనకు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా సుమన్ కెరియర్ లోనే అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక కొన్ని కేసుల్లో ఇరుక్కొని బాధలో ఉన్న సుమన్ కి ఈ సినిమా మంచి ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇక అప్పట్నుంచి వరుసగా సుమన్ మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. అందులో కొన్ని సక్సెస్ లు వస్తే, మరి కొన్ని ఫెయిల్యూర్స్ గా మిగిలాయి.
ఇక మొత్తానికైతే కృష్ణ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ని మిస్ చేసుకున్నాడని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం కృష్ణ లాంటి స్టార్ హీరో ఆ పాత్ర చేయకపోవడమే బెటర్ అని కృష్ణ ని సమర్థించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక మొత్తానికైతే అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి…