https://oktelugu.com/

Magadheera: మగధీర లో స్టార్ హీరోయిన్లను కాదని కాజల్ కు అవకాశం రావడానికి కారణం ఏంటో తెలుసా..?

మగధీర సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి ఒక పది మంది హీరోయిన్లను చూశారట. అందులో త్రిష, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లాంటి చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 20, 2024 / 10:26 AM IST

    Magadheera

    Follow us on

    Magadheera: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రాజమౌళి. మొదట తెలుగులో ఆయన చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో పాటు గా బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని కూడా అందుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసేలా సినిమా చేసి బాలీవుడ్ లోనే 100 కోట్లకు పైన కలెక్షన్ల ను రాబట్టిన తెలుగు సినిమాగా కూడా అప్పట్లో ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్ లు అనే కాకుండా వరల్డ్ లో ఉన్న రికార్డ్ లను కూడా బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి, రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమా తెలుగులో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. అయితే ఈ సినిమా ఇచ్చిన బుస్టాప్ తోనే రామ్ చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

    ఇప్పుడు మగధీర సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి ఒక పది మంది హీరోయిన్లను చూశారట. అందులో త్రిష, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లాంటి చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పటికీ రాజమౌళికి మాత్రం వాళ్లెవరు ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యేలా కనిపించలేదు. ఇక అప్పుడే కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చందమామ ‘ సినిమా వచ్చింది. అది చూసిన రాజమౌళి కాజల్ అయితేనే తన సినిమాలో యువరాణి లా సెట్ అవుతుందని ‘మగధీర ‘ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నాడు.

    ఇక ఈ సినిమా సక్సెస్ తో కాజల్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది…