https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 లో అల్లు అర్జున్ సినిమా మొత్తం గుట్కా వేసుకొని మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మనవాళ్లు చేస్తున్న ప్రతి ప్రయత్నం బాలీవుడ్ లో సక్సెస్ అవుతూ ఉండడంతో ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : December 23, 2024 / 04:56 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సినిమా పుష్ప 2… ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకొని అల్లు అర్జున్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క పరిధి ని విస్తరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటివరకు 1600 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియాలో ది బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సినిమా మొదటి నుంచి చివరి వరకు నోట్లో గుట్కా వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఆయన మాట్లాడే మాటలు ఎవరికీ అర్థం కూడా కావు…మరి గుట్కా వేసుకొని ఎందుకు అల్లు అర్జున్ మాట్లాడాడు సినిమా మొత్తం గుట్కా తోనే ఎందుకు మెయింటైన్ చేశాడు అనే డౌట్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అయితే పుష్ప మొదటి పార్ట్ లో బన్వర్సింగ్ షేకవత్ ని కలిసినప్పుడు మాత్రమే గుట్కా వేసుకున్న అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ లో మాత్రం మొదటి నుంచి చివరిదాకా ఎందుకు దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడనే డౌట్ కి సమాధానం దొరికింది…

    అది ఏంటి అంటే పుష్ప మొదటి పార్ట్ నార్త్ లో బీభత్సమైన సక్సెస్ ని సాధించింది. ముఖ్యంగా నార్త్ లో ఉన్న రూరల్ ఏరియాల్లో భారీ కలెక్షన్స్ రావడం చూసిన సుకుమార్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అలాంటి పద్ధతిని పటించాగు. అందుకే వాళ్లు ఎలా అయితే గుట్కా నోట్లో వేసుకొని మాట్లాడుతూ ఉంటారో అలాంటి స్టైల్ నే ఈ సినిమాలో పొందుపరిచి అల్లు అర్జున్ చేత దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు…

    అందువల్లే అల్లు అర్జున్ సినిమా మొత్తం గుట్కా వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అయితే సుకుమార్ వేసిన ప్లాన్ భారీగా వర్కౌట్ అయింది… కేవలం ఈ సినిమా నార్త్ నుంచే 600 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. ఇక వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు 50% కలెక్షన్స్ ఇక్కడి నుంచే కలెక్ట్ చేస్తూ ఉండటం విశేషము…

    ఇక ఏది ఏమైనా కూడా నార్త్ ప్రేక్షకులకు బాలీవుడ్ సినిమాల కంటే కూడా పుష్ప 2 సినిమా భారీగా నచ్చింది. అందువల్లే వాళ్ళు ఈ సినిమాని ఓన్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చూస్తూ భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు…