Homeఎంటర్టైన్మెంట్Mohan Babu First Wife: మోహన్ బాబు మొదటిభార్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?... ఆమె చెల్లినే...

Mohan Babu First Wife: మోహన్ బాబు మొదటిభార్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?… ఆమె చెల్లినే భార్యగా తెచుకోవడానికి కారణం

Mohan Babu First Wife: విలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్ లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. నటుడు కావాలనే తపనతో చెన్నై వెళ్లిన మోహన్ బాబు ఆఫర్స్ కోసం కాళ్లు అరిగేలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. అన్నం లేక ఆకలి కడుపుతో పడుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. వరుస బ్లాక్ బస్టర్స్ తో కలెక్షన్ కింగ్ అనే బిరుదు తెచ్చుకున్నారు. కాగా కెరీర్ లో ఎదిగే క్రమంలో కొన్ని విషాదాలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. వాటిలో భార్య మరణం ఒకటి. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి ఆత్మహత్య చేసుకొని మరణించారు.

Mohan Babu First Wife
Mohan Babu First Wife

విద్యాదేవి ఆత్మహత్యకు కారణం ఏమిటో కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు స్వయంగా తెలియజేశారు. పరిశ్రమలో నిలదొకుక్కోకుండానే మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. భార్య విద్యాదేవితో చెన్నైలో కాపురం పెట్టారు. అడపాదడపా అవకాశాలు, చాలీచాలని సంపాదనతో మోహన్ బాబు దంపతులు ఇక్కట్లు పడేవారట. ఓ రోజు ఇంటి అద్దె చెల్లించలేదని ఓనర్… సామానులు బయటకు విసిరేసి తినే పాత్రలో మూత్రం పోసాడట. అప్పుడు ఇంట్లోకి వెళ్లి మోహన్ బాబు, విద్యాదేవి ఏడ్చుకున్నారట.

ఆ కసితో నటుడిగా ఎదగాలని మోహన్ బాబు మరింత కష్టపడేవారట. ఎక్కువ సినిమాల్లో నటించే క్రమంలో సరిగా ఇంటికి వచ్చేవాడు కాదట. ఆ సమయంలోనే విద్యాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యాపిల్లలను మోహన్ బాబు కనీసం పట్టించుకోవడం లేదనే అసహనం విద్యాదేవిలో పెరిగిపోయిందట. ఒకరోజు క్షణికావేశంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి మంచు లక్ష్మీ, విష్ణు చిన్నపిల్లలు. విద్యాదేవి మరణంతో పిల్లలు అనాధలు అవుతారని మోహన్ బాబుకు నచ్చజెప్పి దాసరి నారాయణరావు రెండో వివాహం చేశారట.

Mohan Babu First Wife
Mohan Babu

వేరే అమ్మాయి వస్తే తన పిల్లల్ని సరిగా చూసుకుంటుందో లేదో అన్న అనుమానంతో విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. నిర్మలా దేవికి మంచు మనోజ్ పుట్టాడు. అక్క పిల్లలు కావడంతో మంచు విష్ణు, లక్ష్మీలను సొంత బిడ్డల వలె నిర్మలా దేవి పెంచి పెద్దవాళ్ళను చేశారు. ముగ్గురు పిల్లలు ఇద్దరు తల్లులకు పుట్టినవారని తెలిసింది చాలా తక్కువ మందికే. మోహన్ బాబు పిల్లల మధ్య అనుబంధం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనోజ్ కి విడాకులైనప్పుడు విష్ణు, లక్ష్మి అతనికి మోరల్ సప్పోర్ట్ ఇచ్చారు.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version