Hanuman: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రస్తుతం సినిమా టీమ్ ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే…నెక్స్ట్ ఈ సినిమాకి సీక్వల్ ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా నార్త్ లో భారీ విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే హిందువులందరి ఆరాధ్య దైవంగా కొలిచే హనుమంతుడి కథతో రావడం ఒకటైతే, ఈ సినిమాలో ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి చాలా బాగా చూపించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తను పోషించిన పాత్రలో తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూనే తన తమ్ముడిని కాపాడే పాత్రలో విలన్ ను సైతం ఢీ కొట్టేంత ధైర్యాన్ని సాధిస్తూ వాళ్ల మీద ఫైట్ చేస్తుంది. అది హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక అందువల్లే ఈ సినిమా నార్త్ లో విపరీతంగా ఆడిందనే చెప్పాలి.
నిజానికి అక్కడ వచ్చే సినిమాల్లో లేడీస్ ని బాగా డామినేట్ చేస్తూ హీరోలే తోపులు అనే విధంగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఉమెన్ ఎంపవర్ మెంట్ మీద సినిమాలు వస్తే వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని అక్కడి మీడియా ఒకానొక సమయంలో తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని బాగా క్యాచ్ చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎలివేషన్స్ ఇచ్చి సినిమా మీద మంచి హైప్ ను తీసుకొచ్చాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించి ప్రశాంత్ వర్మ ను స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేర్చింది. అలాగే తేజ సజ్జా కూడా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇప్పటినుంచి ఆయన చేసే సినిమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక భారీ సక్సెస్ వచ్చిన వెంటనే సినిమా చేస్తున్న మంటే ప్రతి ప్రేక్షకుడి యొక్క అంచనాలు ముందు సినిమాను బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలను సక్రమంగా రీచ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా కొన్ని స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది…