Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ… దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని సినిమా లవర్ ఉండడు. కెరీర్ లో రామ్ గోపాల్ వర్మ సృష్టించిన సంచనాలు అన్నీ ఇన్నీ కావు. శివతో మొదలైన ఆయన ప్రస్థానం బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగే వరకు కొనసాగింది. రంగీల, సత్య, సర్కార్ వంటి అద్భుతమైన చిత్రాలు ఆయన తెరకెక్కించారు. అయితే అదంతా గతం. ఓ దశాబ్దకాలంగా వర్మ ఇమేజ్ మసకబారుతూ వస్తుంది. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా పేరుగాంచిన వర్మ బూతు చిత్రాల స్థాయికి దిగజారిపోయింది.

వండర్స్ వర్మ కాస్త వివాదాల వర్మగా మారిపోయాడు. అనవసరంగా ఇతరుల జీవితాలను గెలకడం, సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. పబ్లిసిటీ స్టంట్స్ తో ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నారు. మాములుగానే వేగంగా సినిమాలు చేసే వర్మ మరింత వేగంగా షార్ట్ ఫిలిమ్స్ తరహా చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కొండా టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఈ మూవీ పొలిటికల్ దంపతులు కొండా సురేఖ, మురళీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
కొండా కూడా వివాదాస్పద చిత్రమే. కొండా సురేఖ వ్యతిరేక వర్గీయులు కొండా చిత్రాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వర్మను బెదిరించినట్లు కూడా సమాచారం. అయినా వెనక్కి తగ్గని వర్మ కొండా చిత్రాన్ని పూర్తి చేసి జూన్ 23న విడుదల చేస్తున్నారు. కొండా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇక చిత్ర విడుదల నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా వర్మ నాస్తికుడన్న విషయం తెలిసిందే. మరి దేవుడ్ని నమ్మని వర్మ పేరులో రాముడు, కృష్ణుడు ఎందుకు ఉన్నారనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి వర్మ ఆసక్తికర సమాధానం చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ అసలు పేరు రామ్ పండు అట. స్కూల్ లో తనని అలానే పిలిచేవారట. అలాగే ఆ పేరుతో ఎగతాళి కూడా చేసేవారట. దీంతో వర్మ నాన్నగారు రామ్ గోపాల్ వర్మగా పేరు మార్చారట. సో వర్మ అసలు పేరు రామ్ పండు. ఆ పేరు వింటే నవ్వు రాక మానదు. అలాగే ఈ రామ్ పండేనా ఇన్ని వివాదాలకు కారణం అవుతుంది అనిపిస్తుంది. కాగా వర్మ 1962లో తూర్పుగోదారి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడ లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అప్పుడే సినిమా డైరెక్టర్ కావాలనుకున్నాడు.
Also Read:Manchu Lakshmi Yoga: నీకు అవసరమా బామ్మా అంటూ మంచు లక్ష్మిని ఆడేసుకున్నారు… ఇంతకీ ఆమె ఏం చేశారంటే!
[…] Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అసలు పేరు తెలు… […]