https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ సినిమా ఏంటో తెలుసా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో 'పెళ్లి చూపులు' అనే చిత్రంలో హీరో గా నటించే ఛాన్స్ దక్కింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కమర్షియల్ హిట్ గా నిల్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 09:07 PM IST

    Vijay Devarakonda(1)

    Follow us on

    Vijay Devarakonda: ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణం లో బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజి కుటుంబాల నుండి స్టార్ హీరోస్ దగ్గ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఇండస్ట్రీ లోకి వచ్చి ఉన్నారు. దర్శక నిర్మాతల గురి మొత్తం వాళ్ళ మీదనే ఉంటుంది. ఇంతటి డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ లో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చి సక్సెస్ అవ్వడమే కాకుండా, స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా విజయ్ దేవర కొండా జనాల దృష్టిలో పడ్డాడు. అంతకు ముందు ఆయన ‘నచ్చావులే’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసాడు, పెద్దగా గుర్తింపు రాలేదు.

    ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో ‘పెళ్లి చూపులు’ అనే చిత్రంలో హీరో గా నటించే ఛాన్స్ దక్కింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే రేంజ్ లో హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యూత్ ఆడియన్స్ లో విజయ్ దేవరకొండ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో కేవలం టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా క్రేజ్ ని సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన సినిమాలకు యూత్ ఆడియన్స్ లో స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ అంతకు ముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. అందులో రవితేజ హీరో గా నటించిన ఆంజనేయులు చిత్రం కూడా ఉంది.

    బండ్ల గణేష్ నిర్మాతగా, పరశురామ్ పెట్ల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి అప్పట్లో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కానీ, కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో విజయ్ దేవరకొండ కెమెరా మెన్ గా కనిపిస్తాడు. అలా పరశురామ్ పెట్ల కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విజయ్ దేవరకొండా, అదే పరశురామ్ పెట్ల దర్శకత్వం లో ‘గీత గోవిందం’ అనే చిత్రంలో హీరో గా చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం తెరకెక్కింది. ఇది మాత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేస్తున్నాడు.