Photo Story: బాలకృష్ణ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె పెద్దయ్యాక బాలయ్య సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది!

బాలయ్య సినిమాలో బాలనటిగా నటించిన ఈమె, ఆయన సినిమాలోనే హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది, ఇంతకు ఆమె మరెవరో కాదు రాశి. పైన చూపించిన ఫోటో 'బాలగోపాలుడు' చిత్రంలోనిది. ఇందులో రాశి తో పాటు ఉన్న కుర్రాడు కళ్యాణ్ రామ్. అలా చిన్నతనం లో ఈమె రావు గారి ఇల్లు, మమతల కోవెల, చెట్టు క్రింద ప్లీడర్, ఆదిత్య 369 , అంకురం, పల్నాటి పౌరుషం తదితర చిత్రాల్లో నటించింది.

Written By: Vicky, Updated On : October 14, 2024 8:50 pm

Photo Story(5)

Follow us on

Photo Story: ఈ ఫొటోలో బాలయ్య బాబు పక్కన కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, బాలనటిగా ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోయిన్ గా మారి ఎంతో సంస్కారవంతమైన పాత్రలను పోషిస్తూ, ఒక పక్క ఫ్యామిలీ ఆడియన్స్ లో, మరోపక్క యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. అందంతో పాటు అద్భుతమైన నటన ఉండడం వల్ల ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అదే సమయంలో ఈమెకు హిట్స్ కూడా రావడంతో అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంతమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చినా ఈమె క్రేజ్, డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు. హీరోయిన్ గా ఆమె పీరియడ్ అయిపోయినప్పటికీ క్యారక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా రాణించింది.

ఇదంతా పక్కన పెడితే బాలయ్య సినిమాలో బాలనటిగా నటించిన ఈమె, ఆయన సినిమాలోనే హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది, ఇంతకు ఆమె మరెవరో కాదు రాశి. పైన చూపించిన ఫోటో ‘బాలగోపాలుడు’ చిత్రంలోనిది. ఇందులో రాశి తో పాటు ఉన్న కుర్రాడు కళ్యాణ్ రామ్. అలా చిన్నతనం లో ఈమె రావు గారి ఇల్లు, మమతల కోవెల, చెట్టు క్రింద ప్లీడర్, ఆదిత్య 369 , అంకురం, పల్నాటి పౌరుషం తదితర చిత్రాల్లో నటించింది. ఇక పెద్దయ్యాక హీరోయిన్ గా ఈమె ‘లవ్ టుడే’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. విజయ్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. తెలుగు లో ఈ చిత్రాన్ని సుస్వాగతం పేరిట పవన్ కళ్యాణ్ రీమేక్ చేసి ఎంత పెద్ద హిట్ కొట్టాడో మన అందరికీ తెలిసిందే.

rashi

హీరోయిన్ గా రాశి కెరీర్ అప్పట్లో ఎలా ఉండేదంటే, కేవలం ఒక్క 1997 వ సంవత్సరంలోనే ఈమె 11 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత 1998 వ సంవత్సరం లో 10 సినిమాలు, 1999 వ సంవత్సరం 13 సినిమాలు, మొత్తం మీద 3 సంవత్సరాలలో 34 సినిమాల్లో హీరోయిన్ గా నటించి చరిత్ర సృష్టించింది. ఇక బాలనటిగా బాలయ్య హీరో గా చేసిన ‘బాలగోపాలుడు’ ‘ఆదిత్య 369’ లో నటించిన ఈమె, పెద్దయ్యాక ఆయన నటించిన ‘కృష్ణ బాబు’ అనే చిత్రం లో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వలేదు. అలా 2000 సంవత్సరం వరకు ఈమె ఏడాదికి 10 నుండి 13 సినిమాలు చేస్తూ వచ్చింది. అతి తక్కువ సమయంలో ఈ స్థాయి సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ గా రాశి కి టాలీవుడ్ లో ఒక రికార్డు ఉంది. 2017 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చింది.