Kiraak RP Chepala Pulusu: ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ వ్యాపారస్తుడిగా మారిన విషయం తెలిసిందే. అతడు కూకట్ పల్లిలో ప్రయోగాత్మకంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కిరాక్ ఆర్పీ చేపల పులుసు కోసం జనాలు ఎగబడ్డారు. దాంతో వ్యాపారం విస్తరించాడు. మరింత మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. మణికొండలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. మణికొండలో కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ విజయవంతంగా సాగుతుందట.
కిరాక్ ఆర్పీ ఏపీలో కూడా తన బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నాడు. అనంతపురంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభించినట్లు సమాచారం. అయితే కిఆర్సీ ఆర్పీ నిర్ణయించిన ధరలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కేజీ కోరమీను చేపల పులుసు ధర రూ. 1800 వందలుగా నిర్ణయించారట. చేపల పులుసు కోసం అంత ఖర్చు చేయాలా అని కస్టమర్స్ నోరెళ్లబెడుతున్నారు.
కిరాక్ ఆర్పీని ఇదే విషయం అడిగితే కొన్ని రకాల చేపలు చాలా ధర కలిగి ఉంటాయి. అలాగే వాటిని రుచిగా వండటానికి కూడా ఖర్చు అవుతుంది. అందుకే కోరమీను చేపల పులుసుకు అంత ధర అంటున్నాడు. చూస్తుంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించేలా ఉంది. రూ. 40 లక్షల రూపాయల పెట్టుబడితో చేపల పులుసు వ్యాపారం ప్రారంభించారు. ఆయన పెట్టుబడి నెల రోజుల్లోనే వచ్చేసిందట.
ఇక కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. అక్కడ టీమ్ లీడర్ అయ్యాడు. నెల్లూరు యాసలో తనదైన డైలాగ్ డెలివరీతో కిరాక్ ఆర్పీ కామెడీ పంచారు. నాగబాబుకు అత్యంత సన్నిహితుడైన కిరాక్ ఆర్పీ ఆయనతో పాటు జబర్దస్త్ వీడాడు. జబర్దస్త్ మానేశాక దర్శకుడుగా ఓ మూవీ తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం ఆలోచన చేసి సక్సెస్ అయ్యాడు.